Eknath Shinde : మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి ఇప్పటి వరకు మరాఠా ఉద్యమం మాత్రమే టెన్షన్‌గా ఉండేది. అయితే ఇప్పుడు ఓబీసీ కులాల సమీకరణ కూడా ఆందోళనను పెంచుతోంది.
మహారాష్ట్రలోని షిర్డీలో శ్రీ సాయిబాబా సమాధి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ రమేష్ బాయిస్, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ప్రధాన మంత్రి ఆలయం వద్ద కొత్త దర్శన క్యూ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు.
Yogi Adityanath: దేశం మొత్తం ప్రస్తుతం ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై చాలాా చర్చ నడుస్తోంది. కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను సెప్టెంబర్ 18-22 వరకు నిర్వహించడం.. తాజాగా ఈ రోజు ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ చీఫ్ గా మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్‌ని నియమించింది.
మహారాష్ట్రలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన-బీజేపీ కూటమి మెజారిటీ సాధించిన తర్వాత సీఎం పదవికి ఏక్ నాథ్ షిండే పేరును తమ పార్టీ ప్రతిపాదించిందని ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. కానీ దాన్ని బీజేపీ పార్టీ తిరస్కరించింది అని ఆయన తెలిపారు.
విపక్ష ఎమ్మెల్యేలకు నిధుల కేటాయింపుపై మహారాష్ట్రలో దుమారం చెలరేగుతుంది. సోమవారం ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎమ్మెల్యేలు నిధుల కేటాయింపులో విభేదాలపై ఏకనాథ్ షిండే ప్రభుత్వంపై దాడికి దిగాయి వీరితో పాటు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఎదురుదాడికి దిగడం గమన్హ�
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని ఇర్షల్వాడి గ్రామంలో ఇటీవల జరిగిన కొండచరియలు విరిగిపడటంతో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే దత్తత తీసుకోనున్నట్లు శివసేన తెలిపింది.
ఏక్నాథ్ షిండే- దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు అజిత్ పవార్ చేరిక తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య థాకరే శుక్రవారం పేర్కొన్నారు.
ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు జాతీయ పార్టీలో చేరిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్థానంలో ఉండవచ్చని ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ బుధవారం అన్నారు.
రాష్ట్ర మంత్రివర్గంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ చేరిక తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న వివిధ పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య ప్రాథమికంగా 200కి చేరుకోవడంతో గత 51 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఒక ప్రత్యేక దృశ్యం ఆవిష్కృతమైంది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ సోమవారం మహారాష్ట్రలోని సతారాలో తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తన సోదరుడి కుమారుడు అజిత్ పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన ఒకరోజు తర్వాత ఆయన కీలక వ్యాఖ్యలు