Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిసెంబర్ 05న మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో మంగళవారం దేవేంద్ర ఫడ్నవీస్, ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండేని కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన మొదలైన తర్వాత తొలిసారి ఫడ్నవీస్, షిండే సమావేశమయ్యారు.
మహారాష్ట్రకు కాబోయే సీఎంగా దాదాపుగా దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ఖరారైంది. రేపటిలోగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం..ఏక్‌నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా పనిచేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎంగా ఫడ్నవీస్, అతడికి డిప్యూటీలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. డిసెంబర్ 05న ముంబైలో జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమంలో ముగ్గురు ప్రమాణస్వీకారం చేయడనున్నారు.
Read Also: Bhatti Vikramarka : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ నగర అభివృద్ధి జరిగింది
క్యాబినెట్ కూర్పు ఈ విధంగా ఉండే అవకాశం:
బీజేపీ: హోం, రెవెన్యూ వంటి కీలక శాఖలతో సహా 21-22 మంత్రిత్వ శాఖలను దక్కించుకునే అవకాశం ఉంది. స్పీకర్, శాసనమండలి చైర్మన్ పదవులను కూడా పార్టీ నిలబెట్టుకోవాలని భావిస్తున్నారు.
శివసేన: 16 మంత్రిత్వ శాఖలను అభ్యర్థించింది, అయితే పట్టణాభివృద్ధితో సహా 12 మంత్రిత్వ శాఖలతో సరిపెట్టుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే డిప్యూటీ చైర్మన్ పదవిని నిర్వహిస్తుండగా శాసనమండలి చైర్మన్ పదవి కోసం ఆ పార్టీ పోటీ పడుతోంది.
ఎన్సీపీ: ఆర్థిక మరియు డిప్యూటీ స్పీకర్‌తో సహా 9-10 మంత్రిత్వ శాఖలను స్వీకరించే అవకాశం ఉంది.