శివసేన (షిండే) వర్గం తోసిపుచ్చింది. ఎన్డీయే అధిష్ఠానం నిర్ణయంపై ఏక్ నాథ్ షిండే కలత చెందలేదని.. ఆయన ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యారని వెల్లడించింది. అందుకే తన స్వగ్రామం సతారాకు వెళ్లినట్లు తెలిపారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. ఇంకా సస్పెన్ష్ కొనసాగుతోంది. ఈ ఉత్కంఠ మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరిపినా సమస్య మాత్రం కొలిక్కి రాలేదు. ఎటు తెగని పంచాయితీగా మారిపోయింది.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడి 6 రోజులు గడుస్తున్నా.. సీఎం నిర్ణయం తూతూమంత్రంగా సాగుతోంది. షిండేను ఒప్పించేందుకు బీజేపీ పలు ప్రతిపాదనలు చేసినా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎక్‌నాథ్ షిండే మాత్రం అంగీకరించలేదు. ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. శుక్రవారం ముంబైలో జరగాల్సిన కూటమి సమావేశం కూడా వాయిదా పడింది. సమావేశానికి ముందు షిండే తన సొంత గ్రామానికి వెళ్లారు. సీఎం పదవి కంకణం కట్టుకున్న…
మహారాష్ట్ర సీఎం పదవిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై సానుకూల చర్చలు కొనసాగాయి.. ముంబైలో మరోసారి చర్చించిన అనంతరం దీనిపై తుది నిర్ణయం ప్రకటిస్తామని ఏక్ నాథ్ షిండే వెల్లడించారు.
Maharashtra CM: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నిర్ణయానికి మహాయుతిలోని శివసేన, ఎన్సీపీలు అంగీకరించినట్లు సమాచారం. డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఉండబోతున్నారు. తాజాగా అమిత్ షాతో సమావేశమైన ముగ్గురు ఈ ప్రతిపాదనకు అంగీకరించారని తెలుస్తోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుంది. అయితే ముఖ్యమంత్రి పదవిపై మాత్రం పంచాయితీ వీడలేదు. ఏక్‌నాథ్ షిండేను తిరిగి ముఖ్యమంత్రిని చేయాలంటూ శివసేన డిమాండ్ చేస్తోంది.
మహారాష్ట్ర మంత్రి మండలిలో గరిష్ఠంగా 43 మంది మంత్రులను నియమించుకునే ఛాన్స్ ఉంది. ఇందులో 20కి పైగా పదవులను భారతీయ జనతా పార్టీ తీసుకునేందుకు మహాయుతి కూటమి నేతల మధ్య అంగీకారం కుదిరినట్లు ఓ ఇంగ్లీష్ మీడియా కథనాలు ప్రచురించింది. శివసేన(షిండే)కు 13, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీకి 9 క్యాబినెట్ సీట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు టాక్.
Maharashtra: మహారాష్ట్ర సీఎం పదవిపై ఏక్‌నాథ్ షిండే వెనక్కి తగ్గారు. ప్రధాని మోడీ, అమిత్ షా, బీజేపీ నిర్ణయమే ఫైనల్ అని ఆయన స్పష్టం చేశారు. ఎవరు సీఎం అయిన శివసైనికులు మద్దతు ఇస్తారని, తాను బాల్ ఠాక్రే ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. మహారాష్ట్రకు కాబోయే సీఎం బీజేపీ నుంచే ఉంటారని తెలుస్తోంది.
Eknath Shinde: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. అయితే, తదుపరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే, తాజాగా మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. మహాయుతి కూటమి ఎవరిని సీఎంగా ఎన్నుకన్నా శివసైనికులు వారికి మద్దతు ఇస్తారని షిండే స్పష్టం చేశారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. ‘‘నా వల్ల మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ఏదైనా సమస్య ఎదురైతే…