Maharashtra: కేంద్ర పరిశీలకులుగా నిర్మలమ్మ, విజయ్ రూపానీ! షిండే కుమారుడికి కీలక పదవి?
- సీఎం ఎంపిక బాధ్యతలు నిరలమ్మ.. విజయ్ రూపానీకి అప్పగింత!
- షిండే కుమారుడు శ్రీకాంత్ షిండేకు కీలక పదవి?
- ఊహాగానాలను తోసిపుచ్చిన శ్రీకాంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రుపానీకి కేంద్రం బాధత్యలు అప్పగించింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చి 9 రోజులైంది. కానీ కొత్త ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఏర్పడ లేదు. మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ 132 సీట్లు సాధించింది. దీంతో ముఖ్యమంత్రి పీఠం తమకే కావాలని కమలనాథులు పట్టుబడుతున్నారు. కానీ బీహార్ ఫార్ములా ప్రకారం తమకే సీఎం పదవి ఇవ్వాలంటూ శివసేన అడుగుతోంది. ఇలా ఇరుపక్షాల గజిబిజితో హైకమాండ్ కూడా ఏం తేల్చలేకపోతుంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక కోసం కేంద్ర పరిశీలకులుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని కేంద్రం ఏర్పాటు చేసింది. మరోవైపు డిసెంబర్ 5న కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని బీజేపీ ఇప్పటికే ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో సీఎం అభ్యర్థిని కేంద్ర పరిశీలకులు ప్రకటించే ఛాన్సుంది.
ఇదిలా ఉంటే బీజేపీ అభ్యర్థే ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉంది. బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వంలో ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండేకు కీలక పదవి అప్పగించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ షిండేకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు శివసేనను పరిశీలకులు ఒప్పించే అవకాశం ఉంది. మొత్తానికి మరికొన్ని గంటల్లో ఈ మహా సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఇదిలా ఉంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై శ్రీకాంత్ షిండే స్పందించారు. అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. ఎలాంటి పదవిని ఆశించడం లేదని.. లోక్‌సభ ఎన్నికల సమయంలోనే కేంద్ర మంత్రి పదవి ఇస్తామని చెప్పారని.. అందుకు నో చెప్పినట్లు గుర్తుచేశారు. తాజాగా మరోసారి డిప్యూటీ సీఎం పదవిపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు.
మరోవైపు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైనట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. ఆయన పేరును అధికారికంగా ప్రకటించే ఛాన్సుందని సమాచారం. కానీ షిండే ఆరోగ్యం బాగోలేనందున మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ 2014 నుంచి 2019 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2019 అక్టోబర్‌లో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. కేవలం మూడు రోజులు మాత్రం సీఎంగా పని చేశారు. అనంతరం ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక 2022 నుంచి మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా వ్యవహరించారు. మరోసారి బీజేపీ అత్యధిక సీట్లు సంపాదించిన కారణాన దేవేంద్ర ఫడ్నవిస్‌కి ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-132, షిండే శివసేన-57, ఎన్సీపీ-41, ఉద్ధవ్ థాక్రే-20, కాంగ్రెస్-16, శరద్ పవార్-10 సీట్లు సాధించాయి. అయితే షిండే వర్గం.. మహారాష్ట్రలో కూడా బీహార్ ఫార్ములా అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. బీహార్‌లో నితీష్ కుమార్‌కు సీట్లు లేకపోయినా.. ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాదే సూత్రం.. మహారాష్ట్రలో కూడా అమలు చేయాలని పట్టుబడుతోంది. అసలేం జరుగుతుందో తెలియక మహారాష్ట్ర ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!