దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ఆప్-బీజేపీ మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ సాగుతోంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది.
Sanjay Raut: శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 తర్వాత కేంద్రంలో ఎన్డీయే సర్కార్ కొనసాగుతుందో లేదో అనేది తనకు అనుమానంగా ఉందని చెప్పుకొచ్చారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండే ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే, కోడలు వృషాలి షిండేతో కలిసి ఢిల్లీలో పర్యటిస్తున్నారు.
మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఏర్పడింది. దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా.. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మూడు పార్టీల నుంచి మంత్రులుగా ప్రమాణస్వీకారం కూడా చేశారు.
Maharashtra Cabinet: మహారాష్ట్రలో మంత్రి వర్గ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతుంది. హోంశాఖ కావాలని పట్టుబట్టిన శివసేన (షిండే) వర్గానికి ఆ పదవి దక్కడం లేదని ప్రచారంతో ఆయన ఆర్థిక రాజధాని ముంబైని వదిలి పెట్టినట్లు తెలుస్తుంది.
Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర ఘటన జరిగింది. నేడు జరగాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ‘మహావికాస్ అఘాడీ’ కూటమి ఎమ్మెల్యేలు బహిష్కరించారు. వారి నిర్ణయం ప్రస్తుతం పొలిటికల్ సర్కార్ లో చర్చనీయాంశంగా మారింది.
మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ఫడ్నవిస్‌తో పాటు డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండే ప్రమాణం చేశారు. ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడుతూ.. కేవలం పాత్రలు మాత్రమే మారాయని.. అభివృద్ధి మాత్రం ఎక్కడా ఆగదని తెలిపారు. ముగ్గురం కలిసే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వంలోని మంత్రుల పనితీరును బట్టి మంత్రులను ఎంపిక చేస్తామన్నారు. ఇక డిసెంబర్ 7 నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు…
మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడిన మహాయుతి సర్కార్ లో తనకు హోంశాఖను ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే డిమాండ్ చేశారని శివసేన ఎమ్మెల్యే భరత్ గోగవాలే తెలిపారు. షిండే సీఎంగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం ఫడ్నవీస్‌కు హోంశాఖ ఇచ్చారని గుర్తు చేశారు.
మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ఫడ్నవిస్‌తో పాటు డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండే ప్రమాణం చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ముచ్చటగా మూడోసారి గురువారం సీఎంగా ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం ఒక పేషెంట్‌కు ఆర్థిక సాయంపై చేశారు.