Maharashtra: డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించిన షిండే.. ఎల్లుండి సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం..!
- డిప్యూటీ సీఎం పదవికి ఒప్పుకున్న ఏక్‌నాథ్ షిండే..
- ఎల్లుండి సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీలుగా షిండే, అజిత్ పవార్ ప్రమాణస్వీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఏక్ నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్‌ల ‘మహాయుతి’ కూటమి సంచలన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 233 స్థానాలను కైవసం చేసుకుంది. 132 సీట్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మారింది. ఇదిలా ఉంటే, ఎన్నికల ఫలితాలు వచ్చి 10 రోజులు అవుతున్నా , మహారాష్ట్ర సీఎం ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి అనేది స్పష్టంగా తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి అధికార ప్రకటన రాలేదు. మరోవైపు డిసెంబర్ 05న ముంబైలో కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం పదవిపై, తన ఇతర ఆశల్ని సాధించుకునేందుకు ఏక్‌నాథ్ షిండే కొద్దిగా బెట్టు చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
Read Also: Rahul Gandhi: రేపు సంభాల్‌కి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు.. ఇటీవల మసీదు సర్వేలో హింస..
ప్రసుత్తం, ఆయన డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 05న ఫడ్నవీస్ సీఎంగా, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఇద్దరూ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. మహాయుతి కూటమి భాగస్వాములైన శివసేన, బీజేపీ, ఎన్సీపీల మధ్య క్యాబినెట్ పదవులు, పోర్ట్‌ఫోలియోల కేటాయింపు ప్రమాణ స్వీకారం తర్వాత ఉంటుందనే సమాచారం ఉంది.
బీజేపీ హోం, రెవెన్యూ వంటి కీలక శాఖలతో సహా 21-22 మంత్రిత్వ శాఖలు దక్కించుకునే అవకాశం ఉంది. స్పీకర్, శాసనమండలి చైర్మన్ పదవులను కూడా బీజేపీ దక్కించుకోవాలని భావిస్తోంది. ఇక శివసేన 16 మంత్రిత్వ శాఖలను దక్కించుకోవాలని అనుకుంటోంది. పట్టణాభివృద్ధితో సహా 12 మంత్రిత్వ శాఖలతో సరిపెట్టుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే డిప్యూటీ చైర్మన్ పదవి శివసేన వద్ద ఉండగా, మండలి చైర్మన్ పదవిని శివసేన కోరుకుంటోంది. ఎన్సీపీ ఆర్థిక మంత్రి, డిప్యూటీ స్పీకర్‌తో సహా 9-10 మంత్రిత్వ శాఖలను స్వీకరించే అవకాశం ఉంది. గురువారం సాయంత్రం 5 గంటలకు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేస్తారని బీజేపీ వెల్లడించింది. డిసెంబర్ 5న ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు ఇతర ప్రముఖ నాయకులు హాజరు కానున్నారు, ఈ వేడుకకు ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!