మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొననుండడం సంచలనంగా మారింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంపై అసంతృప్తితో మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్‌నాథ్ షిండే.. మరో 11 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని గుజరాత్‌లో సూరత్‌కు వెళ్లినట్లు సమాచారం. తన వెంట 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఏక్‌నాథ్ షిండే తెలిపినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. వీరంతా గుజరాత్ భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సూరత్‌లోని గ్రాండ్ భగవతీ హోటల్‌లో ఆ ఎమ్మెల్యేలు బస చేస్తున్నట్లు…