Eknath Shinde: మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఈరోజు (డిసెంబర్ 3) థానేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇక, హస్పటల్ కి తీసుకెళ్లగా, వైద్యులు అతనికి పూర్తి స్థాయిలో ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. అయితే, కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉండటంతో తన స్వగ్రామం సతారాకు వెళ్లగా.. తీవ్ర జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఇక, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచన చేయడంతో షిండే తన అపాయింట్‌మెంట్‌లన్నింటినీ రద్దు చేసుకున్నారు. ఇక, సోమవారం ఉదయం తిరిగి ముంబైకి వచ్చారు. ఈరోజు ఆరోగ్యం కుదుటపడకపోయే సరికి థానేలోని ఆస్పత్రికి తరలించారు.
Read Also: Priyanka Jain: శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక.. ఇంతకు ఏమైందంటే ?
ఇదిలా ఉండగా.. ఏక్ నాథ్ షిండే కనిపించకుండా పోయాడంటూ జరుగుతున్న ప్రచారంపై శివసేన (షిండే) నేత దీపక్ కేసర్కర్ స్పందించారు. షిండే ఆరోగ్య పరిస్థితి బాగాలేదు.. పూర్తి స్థాయిలో కోలుకుని త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని చెప్పారు. ఇక, ఇటీవలే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఆయన నాయకత్వంలో జరిగాయి.. షిండే స్థాయిని ఎలా కాపాడుకోవాలనేది బీజేపీ కేంద్ర నాయకత్వమే నిర్ణయిస్తుందన్నారు. రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన యొక్క సహకారాన్ని తగిన విధంగా గుర్తించాలని కేసర్కర్ తెలిపారు. కాగా, షిండే నేతృత్వంలోని శివసేన, బీజేపీ, అజిత్ పవార్ ఎన్‌సీపీతో కూడిన మహాయుతి కూటమిలో నుంచి మహరాష్ట్ర ముఖ్యమంత్రి పేరును ఈరోజు ప్రకటించనున్నారు. ఈ నెల 5న ఆజాద్ మైదానంలో నూతన సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, దీనికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.