మహారాష్ట్రలోని ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 7.87 కోట్ల విలువ చేసే 15 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు.
Dubai's new Hindu temple set to open ahead of Dussehra: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో హిందూ ఆలయం ప్రారంభం కానుంది. దుబాయ్ లో కొత్తగా నిర్మించిన ఈ ఆలయం దసరా ముందు రోజు మంగళవారం ప్రారంభం కానుంది. దుబాయ్ లోని జెబెల్ అలీ ప్రాంతంలో ఆ ఆలయాన్ని నిర్మించారు. 2020లో శంకుస్థాపన జరిగిన ఈ దేవాలయం రెండేళ్ల తరువాత నిర్మాణ పనులు పూర్తి చేసుకుంది. ఈ కొత్త దేవాలయం గతంలో ఉన్న సింధీ గురుదర్భార్…
9 ఏళ్ల భారతీయ బాలిక ఐఓఎస్ యాప్ తయారుచేసి అందరినీ ఔరా అనిపించింది. దుబాయ్‌లో ఉండే ఈ బాలిక టెక్నాలజీని వినియోగించియాప్ తయారుచేసిన తీరు పట్ల ఐఫోన్ తయారీదారు ఆపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్ కూడా విస్మయం చెందారు.
ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దుబాయ్‌లో 80 మిలియన్ల డాలర్ల విలువ గల బీచ్-సైడ్ విల్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇది నగరంలోనే అతిపెద్ద నివాస ప్రాపర్టీ డీల్ అని ఒప్పందం గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు తెలిపారు.
Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ హీరో ప్రస్తుతం దుబాయ్ క్రికెట్ స్టేడియంలో రచ్చ చేస్తున్నాడు. నేడు ఆసియా కప్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరుగుతున్న విషయం విదితమే.
Asia Cup 2022: నేటి నుంచి యూఏఈ వేదికగా ఆసియాకప్ టోర్నీ ప్రారంభం కానుంది. నిజానికి ఈ టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉండగా అక్కడి ఆర్ధిక పరిస్థితుల కారణంగా యూఏఈకి షిఫ్ట్ చేశారు. మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. దీంతో అన్ని జట్లు టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా ఈ టోర్నీలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. మొత్తం ఆరు జట్లు.. 13 మ్యాచ్‌లు.. 16 రోజుల పాటు జరగనున్నాయి.…
Irfan Pathan: విస్తారా ఎయిర్‌లైన్స్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్విటర్లో ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను ముంబై నుంచి దుబాయ్ వెళ్తుండగా విస్తారా సిబ్బంది తనతో అనుచితంగా ప్రవర్తించారని ఇర్ఫాన్ పఠాన్ ఆరోపించాడు. ముంబై నుంచి దుబాయ్ వెళ్లేందుకు విస్తారా విమానం యూకే-201లో టిక్కెట్ బుక్ చేసుకున్నానని.. కానీ చెక్ ఇన్ కౌంటర్ వద్ద తనకు చేదు అనుభవం ఎదురైందని పఠాన్ వివరించాడు. తన భార్య, పిల్లలతో దుబాయ్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నానని..…
బతుకుదెరువు కోసం దుబాయ్ బాట పట్టాడు.. 15 ఏళ్లుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో పనిచేస్తున్న ఓ వ్యక్తిని అదృష్టం వరించింది.. ఆన్లైన్ లాటరీలో 10 కోట్ల రూపాయల బంపర్ బహుమతిని తగిలింది.. మొత్తానికి కేరళకు చెందిన వ్యక్తిని అదృష్టం రాత్రికి రాత్రే ధనవంతుడిని చేసింది.. కేరళ రాజధాని తిరువనంతపురంకు చెందిన షానవాజ్.. బతుకుదెరువు కోసం.. గత 15 ఏళ్లుగా యూఏఈలో పనిచేస్తున్నారు. గత ఏడాదిన్నరగా ఆన్లైన్ లాటరీలో పాల్గొంటూ వస్తున్నాడు.. తాజాగా దుబాయ్‌లో జరిగిన ఆన్లైన్…