Mukesh Ambani: దుబాయ్‌లో అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన ముకేష్ అంబానీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukesh Ambani: ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దుబాయ్‌లో 80 మిలియన్ల డాలర్ల విలువ గల బీచ్-సైడ్ విల్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇది నగరంలోనే అతిపెద్ద నివాస ప్రాపర్టీ డీల్ అని ఒప్పందం గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు తెలిపారు. దుబాయ్ కృత్రిమ ఐలాండ్ అయిన పామ్ జుమేరా వద్ద ఉన్న ఈ ప్రాపర్టీని అంబానీ చిన్న కుమారుడు అనంత్ కోసం ఈ సంవత్సరం ప్రారంభంలో కొనుగోలు చేశారు. ఇది ప్రైవేట్ డీల్ కాబట్టి వివరాలు బయటకు రానివ్వలేదు. ఈ బీచ్-సైడ్ మాన్షన్ పామ్ జుమేరా ఐలాండ్‌కు ఉత్తర భాగంలో ఉంది. 10 బెడ్‌రూమ్‌లు, ఒక ప్రైవేట్ స్పా, ఇండోర్, అవుట్‌డోర్ స్విమ్మింగ్ పూల్స్ దీంట్లో ఉన్నాయి. అయితే ఈ ప్రాపర్టీ కొనుగోలుదారులు ఎవరో చెప్పకుండానే లగ్జరీ విల్లాకు సంబంధించిన వివరాలను స్థానిక మీడియా నివేదించింది.
దీర్ఘకాల “గోల్డెన్ వీసాలు” అందించడం ద్వారా, విదేశీయులకు ఇంటి యాజమాన్యంపై పరిమితులను సడలించడం ద్వారా ధనవంతులకు దుబాయ్ ఇష్టమైన మార్కెట్‌గా అభివృద్ధి చెందుతోంది. బ్రిటీష్ ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెక్‌హామ్ తన భార్య విక్టోరియా, బాలీవుడ్ మెగాస్టార్ షారుక్ ఖాన్ అంబానీకి ఇరుగుపొరుగుగా అవతరించారు. వారికి కూడా అక్కడ నివాసాలు ఉన్నాయి. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అంబానీకి చెందిన 93.3 బిలియన్ల డాలర్ల సంపదకు ముగ్గురు వారసులలో అనంత్ ఒకరు. 65 ఏళ్ల వయస్సు గల ముకేష్ అంబానీ ప్రపంచంలోని 11వ అత్యంత సంపన్నుడు. తన సామ్రాజ్యాన్ని గ్రీన్ ఎనర్జీ, టెక్, ఇ-కామర్స్‌లో విస్తరించిన వైవిధ్యీకరణ తర్వాత నెమ్మదిగా తన పిల్లలకు పగ్గాలను అప్పగిస్తున్నారు.
Also Read
- Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
- Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
- Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
Work From Office: ఆఫీసుకు వెళుతున్నాం కదా! ఇంకా ఆ పాత బట్టలేనా? కొనేద్దాం కొత్తవి!!
కుటుంబం విదేశాల్లో తన రియల్ ఎస్టేట్ ఫుట్ ప్రింట్‌ను పెంచుకుంటోంది. ముకేష్ వారసులు రెండో ఇంటి కోసం పశ్చిమ దేశాల వైపు చూస్తున్నారని సమాచారం. గత సంవత్సరం రిలయన్స్ యూకేలో స్టోక్ పార్క్ లిమిటెడ్‌ను కొనుగోలు చేయడానికి 79 మిలియన్ల డాలర్లు వెచ్చించింది. ఇందులో పెద్ద కుమారుడు ఆకాష్ కోసం జార్జియన్ కాలం నాటి భవనం ఉంది. అతను ఇటీవలే టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్‌గా నియమితుడయ్యారు. అతని కవల సోదరి ఇషా న్యూయార్క్‌లో ఓ ఇల్లు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దుబాయ్ ప్రాపర్టీ డీల్ రహస్యంగా ఉంది. రిలయన్స్‌కు సంబంధించినన ఆఫ్‌షోర్ ఎంటిటీలో ఒకటి ఈ డీల్‌ను నిర్వహిస్తుంది. అంబానీల ప్రాథమిక నివాసం ముంబయిలోని 27 అంతస్తుల ఆకాశహర్మ్యంలో మూడు హెలిప్యాడ్‌లు, 168 కార్ల పార్కింగ్, 50 సీట్ల సినిమా థియేటర్, గ్రాండ్ బాల్‌రూమ్. మ్మిది ఎలివేటర్‌లతో ఉంటుంది.
తాజావార్తలు
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు