ఆసియా కప్ లో భాగంగా ఇవాళ శ్రీలంకతో బంగ్లాదేశ్ తలపడుతోంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న గ్రూప్-బి ఐదో మ్యాచ్ తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ భారీ స్కోరు సాధించి సవాల్ విసిరింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసి శ్రీలంకకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో అఫిఫ్ హుస్సేన్ 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్ కి చెందిన ఓపెనర్ మెహిదీ హసన్ మిరాజ్ 38, కెప్టెన్ షకీబల్ హసన్ 24, మహ్మదుల్లా 27, మోసాదక్ హొసైన్ 24 పరుగులు చేశారు.
Read Also: Asia Cup 2022: భారత్, పాకిస్థాన్ జట్లకు షాక్.. మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత
శ్రీలంక బౌలర్లలో వనిందు హసరంగ, చమిక కరుణ రత్నె చెరో రెండు వికెట్లు పడగొట్టగా, దిల్షాన్ మధుశంక, మహీశ్ తీక్షణ, అసిత ఫెర్నాండో తలా ఓ వికెట్ తీసుకున్నారు. అసిత ఫెర్నాండో నాలుగు ఓవర్లు వేసి ఏకంగా 51 పరుగులు ఇచ్చాడు. ఇదిలా వుంటే.. ఈ మ్యాచ్ రెండు జట్లకు ఎంతో ముఖ్యంగా భావిస్తున్నారు. ఈ మెగా టోర్నీలో నిలవాలంటే రెండు జట్లకూ ఈ మ్యాచ్ ఎంతో కీలకం. గ్రూప్ – బిలో ఉన్న ఈ రెండు జట్లు తమ తొలి మ్యాచ్ లో అఫ్గాన్ చేతిలో దారుణంగా ఓడిన సంగతి తెలిసిందే. శ్రీలంక బంగ్లాను ఓడించిన అఫ్గాన్ ఇప్పటికే సూపర్-4కు చేరింది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన విజేత సూపర్-4కు చేరే రెండో జట్టు (గ్రూప్-బిలో) అవుతుంది.
ఓడిన జట్టు ఇక ఇంటికి వెళ్లాల్సిందే. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 12 టీ20లు ఆడగా 8 మ్యాచ్ లలో లంక గెలిచింది. బంగ్లా నాలుగింటిలో నెగ్గింది. ఈ ఉత్కంఠ పోరుపై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి.ప్రస్తుతం బంగ్లా దేశ్ 10.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 85 పరుగులుగా వుంది. ఇంకా 57 బాల్స్ లో 99 పరుగులు చేయాల్సి వుంది.
శ్రీలంక టీం : దనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (wk), చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక (c), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక, మతీషా పతిరణ.
బంగ్లాదేశ్ టీం : మహ్మద్ నయీమ్, అనాముల్ హక్, షకీబ్ అల్ హసన్ (c), అఫీఫ్ హుస్సేన్, ముష్ఫికర్ రహీమ్ (WK), మొసద్దెక్ హొస్సేన్, మహ్మదుల్లా, మహేదీ హసన్, మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్.