Apple CEO: భారతీయుల టెక్ నైపుణ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచస్థాయి ఐటీ సంస్థల్లో మనవాళ్లదే హవా. సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల వంటివారు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. అనేక కోడింగ్ పోటీల్లోనూ, బగ్ ఫైండింగ్ కాంపిటీషన్స్ లోనూ భారతీయులు సత్తా చాటడం తెలిసిందే. తాజాగా 9 ఏళ్ల భారతీయ బాలిక ఐఓఎస్ యాప్ తయారుచేసి అందరినీ ఔరా అనిపించింది. దుబాయ్‌లో ఉండే ఈ బాలిక టెక్నాలజీని వినియోగించియాప్ తయారుచేసిన తీరు పట్ల ఐఫోన్ తయారీదారు ఆపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్ కూడా విస్మయం చెందారు. టిమ్ కుక్ ఆమెను వ్యక్తిగతంగా ఇ-మెయిల్‌లో అభినందించారు.
ఆ బాలిక పేరు హనా మహ్మద్ రఫీక్. తనపేరు కలిసి వచ్చేలా ‘హనాస్’ అనే కథల యాప్‌ను ఆమె రూపొందించింది. ఈ యాప్ లో చిన్నారుల తల్లిదండ్రులు కథలను రికార్డు చేయవచ్చు. ఐఓఎస్ ప్లాట్ ఫాంపై ఈ యాప్‌ను ఉచితంగా పొందవచ్చు.కాగా తాను యాప్ తయారుచేసిన వైనాన్ని హనా… ఈమెయిల్ ద్వారా టిమ్ కుక్‌కు వివరించింది. ఐదేళ్ల వయసు నుంచే తాను కోడింగ్ నేర్చుకుంటున్నానని, ఈ క్రమంలో ఓ యాప్ రూపొందించిన అత్యంత పిన్న వయస్కురాలిని తానే అని భావిస్తున్నానని తెలిపింది. ఐఓఎస్ యాప్ డిజైన్ చేసే క్రమంలో ఎలాంటి థర్డ్ పార్టీ రెడీమేడ్ కోడ్ లను వినియోగించలేదని, 10 వేల లైన్ల కోడ్‌ను సొంతంగానే రాశానని హనా వెల్లడించింది. ఆమె యూట్యూబ్‌లో తన రచనల లింక్‌లను కూడా షేర్ చేసింది.
Ankita Bhandari: రిసెప్షనిస్ట్ అంకిత అంత్యక్రియలు పూర్తి.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణకు సీఎం హామీ
దీనిపై ఆపిల్ సీఈవో టిమ్ కుక్ స్పందించారు. టిమ్ టిక్ ఆమె సాధించిన విజయాన్ని చూసి ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ఇంత చిన్న వయస్సులో హనా సాధించిన అద్భుతమైన విజయాలకు అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో ఇంకెన్నో అద్భుతమైన విజయాలు సాధించగలవు అంటూ చిన్నారిని మెచ్చుకుంటూ మెయిల్ చేసారు. నైపుణ్యాన్ని ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో అద్భుతాలు సృష్టిస్తావని శుభాకాంక్షలు తెలిపారు.