Flying Cars: గత కొన్నేళ్లుగా వాహనరంగంలో వివిధ మార్పులు వస్తున్నాయి. అయితే ఎప్పటి నుంచో ఎగిరే కార్లు మాత్రం చాలా కాలంగా కలగానే ఉన్నాయి. ఇప్పడిప్పుడే రియల్ వరల్డ్‌లో కూడా ఈ ఎగిరే కార్లు టెస్టింగ్ పూర్తి చేసుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎగిరే కార్లను తయారు చేసేందుకు కొన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే భవిష్యత్తులో ఎగిరే కార్లు తప్పకుండా అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. తాజాదా చైనీస్ ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ ఎక్స్‌పెంగ్(Xpeng) తన ఎగిరే కారును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఎగురవేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ టాక్సీని పరీక్షించింది.దీన్ని చూసిన దుబాయ్ నగరవాసులు ఆశ్చర్యపోయారు. ఎక్స్‌రెంగ్ కంపెనీ అంతర్జాతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే సోమవారం తన తొలి ఫ్లయింగ్ కారును పరీక్షిస్తూఆకాశంలో 90 నిమిషాల పాటు బహిరంగంగా ఎగురవేసింది.
ఖలీజ్ టైమ్స్ నివేదించిన ప్రకారం.. రెండు-సీట్ల సామర్థ్యం కలిగిన ఎగిరే కారు గరిష్ట టేకాఫ్ బరువు 760 కిలోల వరకు అది గాలిలో ఎగురుతుంది. సాధారణంగా అయితే దాని బరువు 560 కిలోల వరకు ఉంటుంది. 130 కిమీ/గం టాప్ ఫ్లైట్ వేగంతో ప్రయాణించగలదు. ప్రీమియం కార్బన్ ఫైబర్‌తో తయారు చేయబడింది. ఇందులో ఎయిర్‌ఫ్రేమ్ పారాచూట్ కూడా అమర్చబడింది. కారులో ఒకేసారి ఇద్దరు ప్రయాణికులు ప్రయాణించవచ్చు.కాగా.. ఇది మొదటి ఎగిరే కారు కాదు, దీనికి ముందు చాలా తయారు చేయబడ్డాయి. అయినప్పటికీ, కొంతమంది మాత్రమే ఎగిరికారులో ప్రయాణికులను కూర్చోబెట్టి పరీక్షించారు.
Viral Video: కాలేజీ క్యాంటీన్‌లో ఇద్దరమ్మాయిల ఫైట్.. వీడియో వైరల్
2025 నాటికి ఎగిరే కార్లలో సామాన్య ప్రజలు ప్రయాణించడం సాధ్యమవుతుందని నిపుణులు అంటున్నారు. ప్రపంచంలోని అత్యంత ధనిక నగరాల్లో ఒకటైన దుబాయ్‌తో సహా ఇతర నగరాల్లో కూడా ప్రజలు ఎగిరే కార్లలో ప్రయాణించొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎగిరే కార్లలో చేసే ప్రయాణాలు చాలా ఖర్చుతో కూడుకుని ఉండొచ్చు. ఎక్స్‌పెంగ్ అభివృద్ధి చేసిన ఈ ఎగిరే కారుకు ఎక్స్-2 అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఖలీజ్ టైమ్స్ ప్రకారం.. ఎగిరే కార్లు రాబోయే రెండు లేదా మూడు సంవత్సరాలలో వాణిజ్య ఉపయోగం కోసం అందుబాటులో ఉంటాయి.