ప్రపంచంలో అత్యంత అభివృద్ది చెందిన నగరాల్లో దుబాయ్ కూడా ఒకటి. దుబాయ్ నగరంలో అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. ఎడారిలో నిర్మితమైనప్పటికీ నిత్యం లక్షలాది మంది పర్యాటకులు ఆ నగరాన్ని వీక్షించేందుకు అక్కడికి వస్తుంటారు. ఈ హైక్లాస్ నగరంలో అన్ని రకాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆహారపదార్థాలు అందుబాటులో ఉంటాయి. తక్కువ ధరకు దొరుకుతున్నాయి కదా రుచిగా ఉండవేమో అనుకుంటే పొరపాటే. దుబాయ్ వెళ్లిన వారు తప్పకుండా ఈ ఆహారపదార్థాలను టేస్ట్ చేయాలని చెబుతున్నారు. షావర్మా,…
సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార దుబాయ్‌లో విఘ్నేష్ శివన్‌తో సరదాగా గడుపుతోంది. ఈ జంట కొత్త సంవత్సరాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఇప్పుడు అందమైన నగరంలో క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తున్నారు. ఈ జంట దుబాయ్‌లో సరదాగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా లేడీ సూపర్ స్టార్ నయన్ తో ‘ఎఫ్-3’ బ్యూటీ మెహ్రీన్ పిక్ ట్రెండ్ అవుతోంది. Read also : “పుష్ప”రాజ్ కోసం అమెజాన్ ఎంత చెల్లించిందో తెలుసా? ఇటీవల…
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం ‘ఎస్ఎస్ఎంబి28’ షూటింగ్ కోసం దుబాయ్‌లో ఉన్నారు. పనితో పాటు ఈ హీరో ఫ్యామిలీతో అక్కడే క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాడు. మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ తరచుగా వారి కుటుంబానికి సంబంధించిన అద్భుతమైన క్షణాలను కెమెరాలో బంధించి, సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా మహేష్ తన కుమార్తె సితారతో కలిసి సూపర్ కూల్ లుక్ లో ఉన్న చిత్రాన్ని…
దక్షిణ చిత్ర పరిశ్రమలో తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సౌత్ స్టార్స్ అంతా కలిసి దుబాయ్ ని టార్గెట్ చేశారు అన్పించక మానదు. ప్రస్తుతం దుబాయ్ సౌత్ స్టార్స్ కు అడ్డాగా మారింది. పాన్ ఇండియా స్టార్స్ దృష్టి దుబాయ్ పై పడింది. పాన్ ఇండియా అన్న పేరుకు తగ్గట్టే తమ సినిమాల ప్రమోషన్స్ కోసం దుబాయ్ ని వాడుకుంటున్నారు దక్షిణాది తారలు. బాలీవుడ్ కంటే ‘తగ్గేదే లే’ !ఇంతకు ముందు సినిమా ప్రమోషన్ల కోసం కేవలం…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం “పుష్ప ది రైజ్” పేరుతో డిసెంబర్ 17న థియేటర్లలో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా విడుదలకు ఇంకా నెల రోజుల సమయమే ఉండడంతో “పుష్ప”కి తుది మెరుగులు దిద్దడంలో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా “పుష్ప” స్పెషల్ ఈవెంట్ కు స్పెషల్ ప్లాన్స్ చేస్తున్నారు మేకర్స్. సినిమాపై…
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్ నుండి దుబాయ్ వెళుతున్న ఓ ప్రయాణికుడి వద్ద 13 లక్షల విలువ చేసే సౌదీ రియాల్ గుర్తించారు సీఐఎస్ఎఫ్ సిబ్బంది. అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా విదేశీ కరెన్సీ తీసుకువచ్చాడు ప్రయాణికుడు. బట్టలలో చుట్టి హ్యాండ్ బ్యాగ్ లో విదేశీ కరెన్సీని దాచిన ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. ఎయిర్‌పోర్ట్ లో భద్రతా సిబ్బంది స్క్రీనింగ్ లో పట్టుబడింది విదేశీ కరెన్సీ. ప్రయాణికుడిని అరెస్ట్ చేసి కేసు…
టి 20 మ్యాచ్ లు ఎక్కడ జరగినా క్రీడా ప్రేమికులు అత్యధిక సంఖ్యలో చూస్తుంటారు. ఇక, ఇండియా పాక్ మ్యాచ్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద సంఖ్యలో ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా మాత్రమే కాకుండా టీవీ ఛానళ్లలోనూ చూస్తుంటారు. ఇప్పటి వరకు జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లలో పాక్ ఇండియాను ఓడించలేదు. ఐదుసార్లు రెండు జట్లు తలపడగా ఐదుసార్లు ఇండియానే విజయం సాధించింది. దీంతో ఈసారి ఎలాగైన చరిత్రను తిరగరాయాలని పాక్ అనుకుంటోంది. దీనికోసం పెద్ద ఎత్తున…
ధనాధన్ క్రికెట్లో అత్యున్నత పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి సూపర్-12 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. టీ 20 ప్రపంచ కప్ టోర్నమెంట్ నేటి నుంచి వచ్చే నెల 14 వరకు యూఏఈలో నిర్వహించనున్నారు. ఇవాళ ఆరంభ మ్యాచ్‌ల్లో ఆసీస్-దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్-వెస్టిండీస్ తలపడతాయి. ఈ కప్ భారత్‌లోనే జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వేదికను ఎడారి దేశానికి తరలించారు.ఈనెల 17 నుంచే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లతో అధికారికంగా టీ20 ప్రపంచకప్ ఆరంభమైంది. ప్రధాన మ్యాచ్‌లు మాత్రం సూపర్-12 పేరిట…
టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. దుబాయ్‌లో ఇటీవల కొత్తగా ప్రారంభించిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ మ్యూజియంలో ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, హాలీవుడ్ యాక్షన్ కింగ్ జాకీ చాన్, ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్‌హామ్, నటుడు టామ్ క్రూజ్ వంటి ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి. కాగా అక్టోబరు 14న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియాన్ని అక్కడి నిర్వాహకులు…