Gold Seized: మహారాష్ట్రలోని ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 7.87 కోట్ల విలువ చేసే 15 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వేరు వేరు విమానాల్లో ముంబయి వచ్చిన 4 గురు సూడాన్ జాతీయుల వద్ద బంగారంను గుర్తించారు.
Viral Video: టేకాఫ్ అవుతుండగా ఊడిపడిపోయిన విమాన చక్రం.. మరి ప్రయాణికులు..!
కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని పేస్టుగా మార్చి ఛాతీ, భుజం భాగాలలో దాచి తరలించే యత్నం చేశారు కేటుగాళ్లు. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన స్కానింగ్‌లో అక్రమంగా తరలిస్తున్న బంగారం గుట్టు బయటపడింది. సూడాన్ జాతీయులతో పాటు మరో ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.