Purna: ఎట్టకేలకు నటి పూర్ణ పెళ్లి కూతురు అయ్యింది. సీమ టపాకాయ్, అవును, అవును 2, ఇటీవల అఖండ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ ప్రస్తుతం బుల్లితెరపై కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరిస్తూనే పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. ఇక ఇటీవలే ఆమె తన నిశ్చితార్థం షానిద్ అసిఫ్ ఆలీతో జరిగిందని ఫోటోలు పెట్టి షాక్ ఇచ్చింది. అతను దుబాయ్ లో పెద్ద వ్యాపారవేత్తగా కొనసాగుతున్నాడు. ఇక త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో తనకు ఆల్రెడీ ఆరునెలల క్రితమే పెళ్లి అయిపోయిందని మరో షాక్ ఇచ్చింది పూర్ణ.
ఆసిఫ్ తో నా పెళ్లి ఆరునెలల క్రితమే జరిగిపోయింది అని చెప్తూ ఒక ఫోటో షేర్ చేసింది. దీంతో అసలు అంత సీక్రెట్ గా వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. కొంతమంది మరీ దారుణంగా పూర్ణ కూడా ప్రెగ్నెంట్ ఏమో .. అందుకే సీక్రెట్ గా వివాహం చేసుకుందని రూమర్స్ గుప్పించారు. అయితే అలాంటిదేమి జరగలేదని, కొన్ని కుటుంబ కారణాల వలన పెళ్లిని అత్యంత సన్నిహితుల మధ్య జరిపినట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపారు. మే 31 న వీరి నిశ్చితార్థం జరుగగా.. జూన్ 12 న దుబాయ్ లో ఘనంగా ఈ జంట పెళ్లి చేసుకొన్నారు. అరబిక్ స్టైల్ లో జరిగిన ఈ పెళ్లి ఫోటోలను పూర్ణ తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.