Dubai’s new Hindu temple set to open ahead of Dussehra: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో కొత్తగా హిందూ ఆలయం ప్రారంభం కానుంది. దుబాయ్ లో కొత్తగా నిర్మించిన ఈ ఆలయం దసరా ముందు రోజు మంగళవారం ప్రారంభం కానుంది. దుబాయ్ లోని జెబెల్ అలీ ప్రాంతంలో ఆ ఆలయాన్ని నిర్మించారు. 2020లో శంకుస్థాపన జరుపుకున్న ఈ దేవాలయం రెండేళ్ల తరువాత నిర్మాణ పనులు పూర్తి చేసుకుంది. ఈ కొత్త దేవాలయం గతంలో ఉన్న సింధీ గురుదర్భార్ ఆలయానికి పొడగింపు. సింధీ గురుదర్బార్ యూఏఈలోని పురాతన హిందూ ఆలయాల్లో ఒకటి.
ప్రస్తుతం నిర్మితమైన హిందూ దేవాలయం కోసం దశాబ్ధాల నుంచి డిమాండ్ ఉంది. ఈ ప్రాంత ప్రజలకు ప్రార్థనా స్థలం ఉండాలని అక్కడి హిందువుల డిమాండ్ చేస్తున్నారు. అరబిక్-హిందూ శిల్పకళతో ఈ ఆలయాన్ని నిర్మించారు. దేవాలయం ముఖభాగంలో మొత్తం 16 మంది దేవీదేవతలో అలంకరించబడ్డాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి దేవాలయం పాక్షికంగా తెరుచుకుంది. అప్పటి నుంచి యూఏఈలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు దేవాలయాన్ని సందర్శిస్తున్నారు.
READ ALSO: USA: నలుగురు భారత సంతతి వ్యక్తుల కిడ్నాప్.. బాధితుల్లో 8 నెలల పాప
ఆలయ నిర్వాహకులు ఆలయదర్శనం కోసం ఆన్లైన్ ఫ్లాట్ ఫారాన్ని ప్రారంభించారు. ఆలయ దర్శనానికి క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకువచ్చారు. కొత్తగా తెరుచుకున్న ఈ హిందూ ఆలయం ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనాల కోసం తెరిచి ఉంచుతారు. రోజుకు కేవలం 1000-1200 మంది భక్తులకు మాత్రమే దర్శించుకునే అవకాశం ఉంది. కేవలం పరిమిత సంఖ్యలోనే దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు. ప్రతీ గంటలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించనున్నారు. అక్టోబర్ 5 నుంచి ఆలయం వెబ్ సైట్ లో బుక్ చేసుకున్నవారు ఎలాంటి పరిమితులు లేకుండా దేవాలయాన్ని దర్శించుకోవచ్చని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. దుబాయ్ లోని బెజెల్ అలీలోని ‘ వర్షిప్ విలేజ్’లో ఈ దేవాలయం ఉంది. ఈ ప్రదేశంలో అనేక చర్చిలు, గురుద్వారాలు, దేవాలయాలు ఉన్నాయి.