Donald Trump: “ఆమెను వెంటనే తొలగించండి”.. లేదంటే “భారీ పరిణామాలను” ఎదుర్కుంటారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్, నెట్‌ఫ్లిక్స్ బోర్డ్ మెంబర్ సుసాన్ రైస్ మధ్య నెలకొన్న మాటల యుద్ధం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌పై దాడికి దిగారు. ఆ సంస్థ బోర్డ్ మెంబర్ సుసాన్ రైస్‌ను వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో భారీ పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Also Read
ఇదివరకు బరాక్ ఒబామా వద్ద జాతీయ భద్రతా సలహాదారుగా, జో బైడెన్ ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించిన సుసాన్ రైస్.. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ డిమాండ్లకు లొంగిపోయిన వార్తా సంస్థలు, లా ఫామ్‌లు ఇప్పుడు ప్రజల్లో ఆదరణ కోల్పోయాయని ఆమె అన్నారు. అంతేకాకుండా.. ఒకవేళ డెమొక్రాట్లు తిరిగి అధికారంలోకి వస్తే, ట్రంప్‌కు మద్దతుగా నిలిచిన సంస్థలు ఖచ్చితంగా జవాబుదారీతనాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. డెమొక్రాట్లు పాత పద్ధతుల్లోనే వెళ్తారని భావిస్తే అది పొరపాటే అని ఆమె హెచ్చరించారు.
Income Tax Rules: క్రెడిట్ కార్డ్ వినియోగదారులు జాగ్రత్త.. ఐటీ శాఖ కొత్త నిబంధనలు ఇవే!
సుసాన్ రైస్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ట్రంప్, ఆమెను నెట్‌ఫ్లిక్స్ బోర్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే ట్రంప్ పేర్కొన్న ‘పరిణామాలు’ ఏమిటన్నది స్పష్టంగా వెల్లడించలేదు. కానీ గతంలోనూ తనకు నచ్చని కంటెంట్‌ను ప్రసారం చేసే నెట్‌వర్క్‌లను ట్రంప్ విమర్శిస్తూనే ఉన్నారు. మరోవైపు ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) ఛైర్మన్ బ్రెండన్ కార్ సైతం గతంలో కొన్ని నెట్‌వర్క్‌ల బ్రాడ్‌కాస్ట్ లైసెన్స్ లను రద్దు చేస్తామని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?