Pakistan: పాకిస్తాన్ అణ్వాయుధాలను రహస్యంగా పరీక్షిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కామెంట్స్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పందించింది. ‘‘ అణు పరీక్షలను తిరిగి ప్రారంభించే మొదటి దేశం కాదు’’ అని పాకిస్తాన్ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. సీబీఎస్ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ అణు పరీక్షలను నిర్వహించిన మొదటి దేశం కాదు. అణు పరీక్షలను తిరిగి ప్రారంభించే మొదటి దేశం కాదు’’ అని అన్నారు.
H-1B visa: ట్రంప్ సర్కార్ భారతదేశంపై తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. H-1B వీసాలు అమెరికన్లకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నాయని, భారతీయులు వీటిని దుర్వినియోగం చేస్తున్నారని పలు సందర్భాల్లో అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు విమర్శలు చేస్తున్నారు.
Palestine President: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ఒక బాంబ్ పేల్చారు. ఇంతకీ ఏంటదని అనుకుంటున్నారా.. గాజా ఒప్పందం గురించి ప్రపంచానికి తెలుసుకదా.. ఇదే సమయంలో ట్రంప్ తదుపరి పాలస్తీనా అధ్యక్షుడి గురించి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. ఇక్కడే ఆయన బాంబు పేల్చింది.. ఇంతకీ ఆ బాంబు ఎవరి కొంప ముంచిందని ఆలోచిస్తున్నారా.. మహమూద్ అబ్బాస్‌ది.. ఎందుకంటే తాజాగా ట్రంప్ జారీ చేసిన ముఖ్యమైన ప్రకటనలో మహమూద్ అబ్బాస్ స్వతంత్ర పాలస్తీనా అధ్యక్షుడు…
ఇజ్రాయెల్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే మా మద్దతు మొత్తాన్ని కోల్పోతారని ఇజ్రాయెల్‌కు అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వార్నింగ్ ఇచ్చారు. ఇది చాలా తెలివి తక్కువ పని అంటూ జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు.
No Kings protests: అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతరేకంగా భారీ నిరసనలు జరుగుతున్నాయి. ‘‘ నో కింగ్స్’’ అనే పేరుతో ప్రజలు నిరసనలు నిర్వహిస్తున్నారు. శనివారం న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చారు.
Pakistan: ఈజిప్ట్ ‘‘షర్మ్ ఎల్ షేక్’’లో గాజా శాంతి ఒప్పందంపై ఇజ్రాయిల్, హమాస్ సంతకాలు చేశాయి. దీనికి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు పలు దేశాధినేతలు హాజరయ్యారు. అయితే అన్నింటి కన్నా ఎక్కువగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ట్రంప్‌ను పొగుడుతున్న వీడియో తెగ వైరల్ అయింది. అమెరికా అధ్యక్షుడిని ‘‘శాంతి దూత’’ అని షరీఫ్ ప్రశంసించారు. భారత్-పాకిస్తాన్ యుద్ధం ఆపినందుకు ట్రంప్‌కు పాకిస్తాన్ ప్రధాని థాంక్స్ తెలిపారు.
Hamas: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్-హమాస మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చారు. 2 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని నిలిపేశారు. 20 మంది బతికి ఉన్న బందీలను హమాస్ విడుదల చేస్తోంది. బందీల విడుదలతో ఇజ్రాయిల్ మొత్తం ఆనందంతో సంబరాలు చేసుకుంది. ఇదిలా ఉంటే, ఈ ఆనందం మాటున ఒక విషాదం కూడా దాగుంది. రెండేళ్ల క్రితం అక్టోబర్ 07,2023లో హమాస్ జరిపిన దాడిలో, కిడ్నాప్‌కు గురైన నేపాల్ హిందూ విద్యార్థి బిపిన్ జోషి మరణించారు. అతడి…
Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌పై తన అభిమానాన్ని ప్రదర్శించారు. ఈజిస్ట్ షర్మ్ ఎల్ షేక్‌లో జరిగిన శాంతి సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. ఆసిమ్ మునీర్‌ను తన ‘‘ అభిమాన ఫీల్డ్ మార్షల్’’ అంటూ పిలిచారు. గాజాలో శాంతి నెలకొల్పడంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు తనకు మద్దతు తెలిపారని, అందుకు ఆయనకు థాంక్స్ అని ట్రంప్ అన్నారు.
ఈజిప్టు వేదికగా గాజా శాంతి శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్ర నాయకులంతా హాజరయ్యారు. ట్రంప్ ప్రసంగించిన తర్వాత మాట్లాడాల్సిందిగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను ఆహ్వానించారు.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెరుగుతున్న సరిహద్దు వివాదానికి మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకొచ్చారు. యుద్ధాలను పరిష్కరించడంలో, శాంతిని స్థాపించడంలో తాను నిపుణుడినని పేర్కొన్నారు. ట్రంప్ మాట్లాడుతూ.. ఇది నేను పరిష్కరించబోయే 8వ యుద్ధం అవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం గురించి చర్చ జరుగుతోంది.” శాంతిని మధ్యవర్తిత్వం చేయగల తన సామర్థ్యాన్ని నొక్కి చెబుతూ, “నేను యుద్ధాలను పరిష్కరించడంలో నిపుణుడిని, శాంతిని నెలకొల్పడంలో నేను నిపుణుడిని. అలా చేయడం గౌరవంగా భావిస్తున్నాను”…