Iran: ఉద్రిక్తతల వేళ ఇరాన్‌లో కూలిన ఫైటర్ జెట్.. పైలట్ మృతి
- ఉద్రిక్తతల వేళ ఇరాన్‌లో కూలిన ఫైటర్ జెట్
- పైలట్ మృతి.. గాయాలతో బయటపడ్డ మరో ఫైలట్
- 10 రోజుల్లో ఏదైనా జరగవచ్చన్న ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌కు చెందిన ఫైటర్ జెట్ కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. పశ్చిమ హమేదాన్ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగిందని.. ఫైటర్ జెట్‌లో ఇద్దరు పైలట్లు ఉండగా ఒక పైలట్ మరణించారని రాష్ట్ర ప్రసార సంస్థ వెల్లడించింది. అర్థరాత్రి శిక్షణా సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా పేర్కొంది. అయితే ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని ఇరిబ్ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ఇది కూడా చదవండి: Trump: బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్‌లో పాక్ ప్రధానికి అవమానం.. ట్రంప్ ఏం చేశారంటే..!
Also Read
గత కొద్దిరోజులుగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికాతో అణు ఒప్పందానికి ఇరాన్ నిరాకరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఈ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ కూడా తన సైన్యాన్ని సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ఫైటర్ జెట్ కూలిపోయినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే గురువారం వాషింగ్టన్‌లో జరిగిన బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్‌లో ట్రంప్ మాట్లాడుతూ మరోసారి ఇరాన్‌కు తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. రాబోయే 10 రోజుల్లో ఇరాన్‌పై పెద్ద విషయం జరగవచ్చని.. ఆలోపు ఇరాన్ తప్పనిసరిగా రాజీపడాలని ట్రంప్ హెచ్చరించారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సూచించారు.
ఇది కూడా చదవండి: Trump-Obama: ఒబామా చాలా తప్పు చేశారు.. ఆ వార్త లీక్ చేయడంపై ట్రంప్ అభ్యంతరం
ఇదిలా ఉంటే అమెరికాతో ఢీ అంటే ఢీ అనడానికి ఇరాన్ రెడీ అవుతోంది. అమెరికా యుద్ధ నౌకలను సముద్రంలోనే ముంచేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హెచ్చరించారు. దీనిని బట్టి ఇరాన్ కూడా యుద్ధానికి దిగేందుకు సిద్ధపడుతున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఇక ఒమన్, జెనీవాలో జరిగిన అణు ఒప్పంద చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి.
ఇది కూడా చదవండి: US-UK: ఇరాన్‌పై దాడికి ప్రణాళిక.. బ్రిటన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు.. కారణమిదే!
తాజావార్తలు
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?