దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా పాకుతుంది. మళ్లీ కరోనా కేసులు తీవ్రంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో.. మహారాష్ట్రలో కొత్తగా 87 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాతో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. కాగా.. ముంబైలో 19 కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పూణె, సాంగ్లీ జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదైంది. ఇదిలా ఉంటే.. నిన్న రాష్ట్రంలో 37 మందికి కరోనా సోకింది. మార్చి 2020 నుండి…
కరీంనగర్ లోని ఓ ప్రభుత్వ హాస్టల్ లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నగునూరులో సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో డిగ్రీ ఫస్ట్ ఈయర్ చదువుతున్న 19 ఏళ్ల సృజన సూసైడ్ చేసుకుంది. ఎవరు లేని సమయంలో హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుని బలవన్మరణం చేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని సృజన స్వస్థలం.. మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామంగా గుర్తించారు.
శబరిమలకు అయ్యప్ప దర్శనానికి వెళ్తూ.. అనంత లోకాలకు వెళ్లారు. స్వామి దర్శనం చేసుకోకుండానే.. మధ్యలోనే వారిని మృత్యువు వెంటాడింది. తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన అయ్యప్ప స్వాములు ముగ్గురు మృతి చెందారు.
ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏజెన్సీలో చిన్న చినుకుపడితే చాలు రోడ్లన్నీ అధ్వాన్నంగా మారిపోతాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే.. గర్భిణీలకు చాలా ప్రమాదకరం. ఎందుకంటే పురిటినొప్పులతో ఆ రోడ్లను దాటి వెళ్లడం సాధ్యం కాదు.. అంతకుమించి అక్కడికి ఏ వాహనాలు రావు. ఒకవేళ వచ్చినా, అందులో కూరుకుపోవాల్సిందే.
జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గందర్‌బాల్ జిల్లాలోని శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై వెళ్తుండగా.. ట్యాక్సీ లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ఉన్న జోజిలా పాస్ వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వారు కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
షాహిబాగ్‌లోని వసంత్ విహార్ ఫ్లాట్‌లో లిఫ్ట్‌లో చిక్కుకుని 6 ఏళ్ల చిన్నారి మృతి చెందాడు. దీపావళి రోజున ఈ ప్రమాదం జరిగింది. ఆర్య కొఠారి అనే చిన్నారి ఆడుకుంటుండగా ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్ లిఫ్ట్ లోకి వెళ్లాడు. ఆర్య కొఠారి లిఫ్ట్‌లోకి వెళ్లిన వెంటనే లిఫ్ట్ డోర్ మూసుకుంది. దీంతో అతను లిఫ్ట్, ఫ్లోర్ మధ్య ఇరుక్కుపోవడంతో.. తల లిఫ్ట్ గేటులో ఇరుక్కుపోయింది.
మెదక్ జిల్లాలో పండగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు పిల్లలతో స్కూటీపై వెళ్తున్న తల్లిని టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు కుమారులు మృతి చెందారు. తల్లి స్వల్ప గాయాలతో బయటపడింది.
ఉత్తరప్రదేశ్లోని బరేలీలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఓ రైతును పోలీసులు అన్యాయంగా కొట్టి చంపారు. ఈ ఘటనకు పాల్పడ్డ పోలీసులపై మృతుడి కుటుంబీకులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.
కృష్ణాజిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తోట్లవల్లూరు మండలంలోని పాములలంకలో విద్యుత్ షాక్ తో ఇద్దరు రైతులు మృతి చెందారు. పాములలంకకు చెందిన పాముల విజయాంభ, పాముల చిరింజీవిగా గుర్తించారు.
శ్రీలంక క్రికెట్ జట్టు వీరాభిమాని పెర్సీ అబేశేఖర(87) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతుండగా.. సోమవారం కొలంబోలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. అబేశేఖరను క్రికెటర్స్ ముద్దుగా "అంకుల్ పెర్సీ" అని పిలుచుకునేవారు.