Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో లోయలో పడ్డ ట్యాక్సీ.. ఐదుగురు పర్యాటకులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గందర్‌బాల్ జిల్లాలోని శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై వెళ్తుండగా.. ట్యాక్సీ లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ఉన్న జోజిలా పాస్ వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వారు కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
Nandamuri Balakrishna: తెలంగాణ ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకండి.. రేవంత్ రెడ్డి
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ప్రమాదంలో మృతులుంతా కేరళ వాసులుగా గుర్తించారు. అక్కడ ప్రదేశాలను సందర్శించేందుకు వారు జమ్మూ కాశ్మీర్‌కు వచ్చారు. ప్రమాద సమయంలో ట్యాక్సీలో 8 మంది ఉన్నారు. అందులో 5 మంది మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన తర్వాత సోనామార్గ్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Venkata Ramana Reddy: బండి సంజయ్ ను కలిసిన కామారెడ్డి విన్నర్
నివేదికల ప్రకారం.. కేరళ నుండి పర్యాటకులు టాక్సీలో సోనామార్గ్ వెళ్తున్నారని చెబుతున్నారు. వాహనం జోజిలా పాస్ వద్దకు రాగానే అదుపుతప్పి లోతైన లోయలో పడింది. అక్కడికక్కడే నలుగురు చనిపోగా.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. మృతులంతా కేరళలోని చిత్తూరు జిల్లా వాసులు కాగా, ఒక డ్రైవర్ జమ్మూ కాశ్మీర్‌కు చెందినవాడు. ఈ ప్రమాదంలో అరుణ్, రాజేష్, మనుజ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఐజాజ్, విఘ్నాష్, రాహుల్, సుదేష్, అనిల్ అనే డ్రైవర్లు చనిపోయారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!