దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా పాకుతుంది. మళ్లీ కరోనా కేసులు తీవ్రంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో.. మహారాష్ట్రలో కొత్తగా 87 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాతో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. కాగా.. ముంబైలో 19 కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పూణె, సాంగ్లీ జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదైంది. ఇదిలా ఉంటే.. నిన్న రాష్ట్రంలో 37 మందికి కరోనా సోకింది. మార్చి 2020 నుండి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 81,72,287 కు చేరుకుంది మరియు మరణాల సంఖ్య 1,48,566 కి చేరుకుంది.
Read Also: JC Prabhakar Reddy: పోలీసులకి ఖాకీ డ్రెస్సులు ఎందుకు..? వాళ్లను చూస్తే సిగ్గేస్తుంది..!
డిసెంబర్ 14 నుంచి 20వ తేదీ మధ్య మహారాష్ట్రలో 46 కోవిడ్ కేసులను గుర్తించారు. డిసెంబర్ 21 నుంచి 27వ తేదీ మధ్య 267 కొత్త ఇన్ఫెక్షన్ కేసులు నిర్ధారించబడ్డాయి. ఇప్పటివరకు.. ఒమిక్రాన్ యొక్క కొత్త ZN.1 సబ్-వేరియంట్‌కు సంబంధించిన 10 కేసులు రాష్ట్రంలో గుర్తించారు. అందులో 5 థానే నగరంలో, 2 పూణేలో, అకోలా, సింధుదుర్గ్ జిల్లాలలో ఒక్కొక్కటి గుర్తించారు.
Read Also: Ayodhya: రామమందిర శంకుస్థాపన ఆహ్వానితులకు ప్రత్యేక బహుమతులు
ప్రస్తుతం.. ఒమిక్రాన్ యొక్క ‘XBB.1.16’ సబ్-వేరియంట్ దేశ వ్యాప్తంగా వ్యాపిస్తుంది. మొత్తం 1972 మందికి ఈ వేరియంట్ సోకినట్లు గుర్తించారు. ఈ వేరియంట్ కారణంగా 19 మంది రోగులు మరణించారని ఆరోగ్య శాఖ తెలిపింది. మంగళవారం సాయంత్రం నుంచి రాష్ట్రంలో 10,864 శాంపిల్స్‌ను కరోనా వైరస్‌ను పరీక్షించారు.