Road Accident: మెదక్ జిల్లాలో పండగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు పిల్లలతో స్కూటీపై వెళ్తున్న తల్లిని టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు కుమారులు మృతి చెందారు. తల్లి స్వల్ప గాయాలతో బయటపడింది. అయితే కళ్ళముందే తన కుమారులు చనిపోవడంతో ఆ తల్లి గుండె పగిలేలా రోధిస్తుంది.
Read Also: Ponguleti Srinivas Reddy : కార్యకర్తలను కాపాడుకోవడం కోసం నేను ఎంతవరకైనా వెళ్తా
దీపావళి సందర్భంగా.. పిల్లలకు టపాసులు కొనిచ్చేందుకు షాప్ కి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే.. రెండేళ్ల క్రితమే తన భర్త శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలోనే చనిపోయాడు. అప్పుడు భర్తని, ఇప్పుడు పిల్లల్ని కోల్పోవడంతో తీవ్రంగా దు:ఖ సాగరంలోకి వెళ్లిపోయింది. దీంతో ఆ తల్లి అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమేను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన కుమారులు పృధ్విరాజ్ (12), ఫణి తేజ (10)గా గుర్తించారు. తల్లి అన్నపూర్ కస్తూరిబా స్కూల్ లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తుంది.
Read Also: Tula Uma: తప్పుడు ప్రచారాలు చేయకండి.. మీడియాపై తుల ఉమ ఫైర్