ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో సోమవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అయితే ఈ ఘటనలో ఓ ఆరు నెలల చిన్నారి మరణించింది. అంతేకాకుండా తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన తల్లి ముట్వాండి గ్రామానికి చెందిన నివాసి. అయితే కాల్పులు జరుగుతున్న సమయంలో ఆ తల్లి అక్కడ ఎందుకు ఉందో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఈ కాల్పుల్లో ఇద్దరు జిల్లా రిజర్వ్ గార్డ్ జవాన్లు కూడా గాయపడ్డారని పోలీసు అధికారి తెలిపారు.
Read Also: CJI DY Chandrachud: ఆర్టికల్ 370పై మాట్లాడేందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు సీజేఐ
గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముట్వాండి అడవుల్లో కొందరు నక్సలైట్లు ఉన్నారని బీజాపూర్ జిల్లా పోలీసులకు సమాచారం అందింది. దీంతో.. DRG-CRPF బలగాలు సంఘటనా స్థలానికి బయలుదేరాయి. పోలీసులు రావడం గమనించిన నక్సలైట్లు పోలీసు బృందంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
Read Also: CJI DY Chandrachud: ఆర్టికల్ 370పై మాట్లాడేందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు సీజేఐ
మరోవైపు.. ఈ ఎన్‌కౌంటర్‌లో భైరం ఘడ్ ఏరియా కమిటీ కార్యదర్శి చంద్రన్న, ఏరియా కమిటీ సభ్యుడు మంగ్లీ బృందంలోని కొందరు గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం పరిసర ప్రాంతాల్లో డిఆర్‌జి, సిఆర్‌పిఎఫ్ బలగాలు సోదాలు నిర్వహిస్తున్నాయి.