Child Died: డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ చిన్నారి బలైపోయింది. నిర్లక్ష్యంగా వాహనం నడపటంతో చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం పాలి గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారి బస్సు కింద పడి మృతి చెందింది. బస్సు దిగి ఇంటికి వెళ్తున్న సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో వాడపల్లి శ్రీవల్లి (5) అనే చిన్నారి అక్కడికక్కడే చనిపోయింది. చిన్నారి అత్తిలి మండలం పాలి గ్రామానికి చెందిన కాగా.. అత్తిలి జేమ్స్ స్కూల్లో LKG చదువుతుంది.
Read Also: Nandyala: రేపు ఆళ్లగడ్డలో చంద్రబాబు సభ.. నేతల మధ్య భగ్గుమన్న విబేధాలు..
చిన్నారి తండ్రి ధర్మరాజు వ్యవసాయ కూలీ కాగా, తల్లి గృహిణి.. అయితే ఆ స్కూల్ బస్ రెగ్యూలర్ గా నడిపే డ్రైవర్ సెలవుపెట్టడంతో.. సోమవారం కొత్త డ్రైవర్ ను పెట్టింది స్కూల్ యాజమాన్యం. కాగా.. అల్లారుముద్దుగా పెంచుకునే తమ చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు తీవ్రంగా కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Meena: జడ్జిగా మారిన మీనా.. ఏ షోకు అంటే.. ?