Tamil Politics: ఎన్డీయే- విజయ్ పొత్తు లేనట్లే.. కారణం రజనీకాంత్…
- బీజేపీ-విజయ్ పొత్తు చర్చల్లో ప్రతిష్టంభన..
- టీవీకే నేత అర్జున ‘‘రజనీకాంత్’’పై చేసిన వ్యాఖ్యలే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Politics: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈసారి తమిళనాట త్రిముఖ పోరు నెలకొంది. గతంలో డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య ప్రత్యక్ష పోటీ ఉండేది. అయితే, ఈ సారి సినీ నటుడు విజయ్ తన టీవీకే పార్టీలో రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. విజయ్‌కు తమిళనాడులో ఉన్న ఫాలోయింగ్ ఇతర పార్టీలను కూడా కలవరపెడుతున్నాయి. మరోవైపు విజయ్‌తో పొత్తు కోసం బీజేపీ తెగ ప్రయత్నిస్తోంది. విజయ్‌ను ఎన్డీయేలోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయ్‌కు డిప్యూటీ సీఎం, 80 సీట్లను ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ చర్చల్లో విజయ్ ముఖ్యమంత్రి పదవి కోరినట్లు తెలుస్తోంది.
Read Also: Dhurandhar 2 : నా బామ్మర్ది ఇండియాలో బిగ్గెస్ట్ డైరెక్టర్ అవుతాడు : ఆదిత్య ధర్
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
ఇదిలా ఉంటే, ఇప్పుడు బీజేపీ-విజయ్ మధ్య పొత్తు చర్చలు దాదాపుగా ముగిసినట్లే అని తెలుస్తోంది. దీనికి కారణం సూపర్ స్టార్ రజనీకాంత్ అనే వాదన వినిపిస్తోంది. టీవీకే కీలక నేత అధవ్ అర్జున్ రజనీ కాంత్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘‘ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా డీఎంకే భయపెట్టింది.’’ అని ఆయన అనడంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. డీఎంకేతో పాటు రజనీకాంత్ ఫ్యాన్స్ కూడా ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.
ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి ఈ వ్యాఖ్యలను రాజకీయంగా అసభ్యకరమైనవిగా అభివర్ణించారు. సూపర్‌స్టార్‌కు ఉన్న భారీ అభిమానుల్ని ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన రజనీకాంత్‌కు మద్దతుగా నిలిచారు. రజనీకాంత్ రాజకీయాలకు అతీతంగా అంతా అభిమానించే సినీ ప్రముఖుడని, ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడటం ఆమోదయోగ్యం కాదని అఅన్నారు. బీజేపీ నేత అన్నామలై కూడా సూపర్‌స్టార్‌పై చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా విమర్శించారు. దాదాపుగా మూడు దశాబ్ధాల పాటు రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. రజనీకాంత్ తన ఆరోగ్య సమస్యలు, కోవిడ్-19 కారణం వల్ల 2020లో అధికారికంగా రాజకీయాల నుంచి వైదొలిగారు.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!