కెన్యాలో డ్యామ్ తెగిన ఘటనలో 42 మంది మృతి చెందారు. పలువురు బురదలో కూరుకుపోయారు. వారి కోసం అధికారులు గాలిస్తున్నారు. కాగా.. కెన్యాలో కొన్ని రోజులుగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో.. ఓ డ్యామ్ తెగిపోయి అక్కడి జనాన్ని అతలాకుతలం చేసింది. నకురు కౌంటీలోని మాయి మహియు పట్టణ సమీపంలోని డ్యామ్ లో నీటి ఒత్తిడికి కట్ట తెగిపోయింది. ఆ నీరంతా సమీపంలోని ఊళ్లను ముంచెత్తింది. దీంతో పెద్ద సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోగా.. రోడ్లు…
పెంపుడు కుక్కలతో చాలా మందికి ఎంతో అనుబంధం ఉంటుంది. ఎంత అంటే.. ప్రాణం కంటే ఎక్కువని చెప్పొచ్చు. పెంపుడు కుక్కలను ఎంతో ఇష్టంగా అల్లారుముద్దుగా పెంచుకుంటారు. అయితే.. పెంపుడు కుక్క చనిపోయిందని ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానాలోని యమునానగర్ లో చోటు చేసుకుంది. బాలిక మృతితో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అనంతరం.. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా.. బాలిక తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో తమ పేర్లను స్థానిక ఆలయ పండుగ కరపత్రంలో ప్రచురించకపోవడంపై రెండు గ్రూపుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో 80 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరంలోని వస్త్రాపూర్ ప్రాంతంలో బుధవారం రాత్రి ఒక వర్గం మరో వర్గంపై కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
అమెరికాలోని అరిజోనాలోని లేక్ ప్లెసెంట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనగా.. ఈ ఘటనలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం రాత్రి ఈ ఇద్దరు తమ మిత్రులతో కలిసి విశ్వవిద్యాలయం నుంచి ఇంటికి కారులో వస్తుండగా ఓ గుర్తు తెలియని వాహనం వీరి కారును బలంగా ఢీ కొట్టింది. కాగా.. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మృతులు నివేష్ ముక్కా (19), గౌతమ్ పార్సీ…
Punjab : పంజాబ్‌లోని సంగ్రూర్ జైలులో రెండు గ్రూపుల ఖైదీలు ఘర్షణ పడ్డారు. ఈ హింసాత్మక ఘర్షణలో ఇద్దరు ఖైదీలు మరణించారు. శుక్రవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఖైదీలు తమ బ్యారక్‌లో పడుకోబోతున్న సమయంలో పాత కక్షల కారణంగా పరస్పరం ఘర్షణ పడ్డారు.
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్-వడోదర ఎక్స్ప్రెస్ హైవేపై నదియాడ్ సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ను ఓ కారు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. వారిలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఒమన్లోని మిడిల్ ఈస్ట్ నగరంలో ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. సోమవారం కురిసిన భారీ వర్షానికి 13 మంది చనిపోయారు. యుఏఈకి చెందిన ఖలీజ్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒమన్లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్లో తప్పిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా.. ఓ చిన్నారి సహా మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
యూపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ అన్న.. ఇద్దరు చెల్లెల్లు మృతి చెందారు. మరో బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ప్రమాదం.. గ్రేటర్ నోయిడాలోని ప్యారీ చౌక్ సమీపంలో జరిగింది. నలుగురు కలిసి బైక్ పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. వీరంతా.. వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై…
పాకిస్థాన్ దేశంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పాక్ లోని సింధ్ రాష్ట్రంలో గల సంఘర్ జిల్లాలో బోర్వెల్లోని కలుషిత నీరు తాగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు మరణించారు.