యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం వద్ద తెల్లవారుజామున జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో కానిస్టేబుల్ కోలా నరేష్ (PC -184) అక్కడిక్కడే మృతి చెందారు. అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాన్ని చౌటుప్పల్ మార్చురికి తరలించారు. మృతుడి స్వస్థలం తాడ్వాయి గ్రామం మునగాల మండలం సూర్యాపేట జిల్లాగా గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఒక…
మహబూబ్ నగర్ సీసీ కుంట మండలం ఫర్దిపూర్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం పలు కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని నింపింది. ఉజ్జయిని పుణ్య క్షేత్ర దర్శనానికి వెళ్తుండగా తుఫాన్ ను ట్రక్కు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు నర్సింహా (28), శివ (26) మృతి. మరో 9 మందికి గాయాలు అయ్యాయి. బాధితులంతా ఫర్దిపూర్ గ్రామస్థులే అని అధికారులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన…
ఏపీలో పనిచేస్తున్న ఐఏఎస్ క్రిస్ట్ కిషోర్ కుమార్ భార్య సత్య దీపిక అనుమానాస్పద మృతి చెందింది. త్రోట్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న దీపిక ను ఆయుష్ ఆసుపతిలో డిసెంబర్ 31న చేర్చారు కుటుంబ సభ్యులు. డిసెంబర్ 31న స్థానిక ఆయుష్ ఆసుపత్రిలో చేరిన సత్య గీతిక ఇవాళ తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మృతి పై అనుమానాలు ఉన్నాయని సత్య గీతిక సోదరి సరిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ…
సోషల్ మీడియా ఎఫెక్ట్, సినిమాల ప్రభావం ఏమోగాని ఇటీవల లవ్ స్టోరీలు ఎక్కువైపోతున్నాయి. తెలిసి తెలియని వయసులో అట్రాక్షన్ కు లోనై అదే లవ్ అనుకుని కొందరు జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టుకుంటున్నారు. పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్తున్నారు. అయితే ప్రేమ వివాహం తర్వాత భర్త వేధింపులు లేక అత్తమామల వేధింపులతో యువతులు బలైపోతున్నారు. ప్రేమ పెళ్లి ఇష్టం లేక కొందరు, కట్నం డిమాండ్ చేస్తూ మరికొందరు ప్రియురాలి మృతికి కారణమవుతున్నారు. ఇదే రీతిలో…
Hyderabad: హైదరాబాద్ లో కార్ఖానా ప్రాంతానికి చెందిన జవేరియా రిజ్వానా తన కొడుకు మాజ్‌అమ్మద్, కూతురుతో కలిసి ఫంక్షన్ కి వెళ్ళింది. అర్ధరాత్రి ఫంక్షన్ నుంచి వచ్చేటప్పుడు ర్యాపిడూ ఆటోను బుక్ చేసుకున్నారు. అయితే, ప్యారడైజ్ దగ్గరకు రాగానే రిజ్వానా ప్రయాణిస్తున్న ఆటోను నలుగురు యువకులు వెంబడించారు.
తెలంగాణ హైకోర్టులో ఓ సీనియర్ న్యాయవాది గుండెపోటుతో మరణించాడు. మంగళవారం ఓ కేసుకు సంబంధించి తన క్లైయింట్ తరుఫున వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో లాయర్ వేణుగోపాల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడున్న తోటి లాయర్లు, కోర్టు సిబ్బంది హాస్పిటల్‌కు తరలించే లోపే మార్గమధ్యలో న్యాయవాది వేణుగోపాల్ రావు మృతి చెందాడు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్లిన కొడుకు ఇంటికి ఆలస్యంగా వచ్చాడని కన్న కొడుకుని కొట్టి చంపాడు ఓ తండ్రి.. ఈ ఘటన చౌటుప్పల్ రూరల్ ఆరేగూడెం గ్రామంలో జరిగింది. అయితే పాఠశాలలో ఓ అవార్డ్ ప్రోగ్రాంలో పాల్గొన్న కొడుకు.. అక్కడ ఆలస్యం అయింది. ఈ క్రమంలో ఇంటికి ఆలస్యంగా రావడంతో కొడుకు భానుని(14) తండ్రి సైదులు కొట్టి చంపాడు.
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెడన బైపాస్ రోడ్ లో లారీ, బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. మచిలీపట్నం నుండి పెయింట్ పని ముగించుకుని తిరిగి స్వగ్రామం అత్తమూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఖమ్మంలో గత రెండు రోజుల క్రితం అదృశ్యం అయి కాలువ లో మృత దేహంగా లభ్యం అయిన సంజీవ్ కుమార్ అనే యువకుడి ఘటన విషాదాంతం అయ్యింది. పండుగ రోజున తన సోదరుని బైక్ పై తీసుకురావడానికి ఇంటి నుంచి వెళ్లి మృత్యు వాత పడ్డారు. తన సోదరుడికి వాయిస్ మెయిల్ పంపించాడు. ఒక మహిళను కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తున్నారని నన్ను ఆటోతో కొట్టి చంపేస్తున్నారని వాయిస్ మెయిల్ లో సోదరుడికి పెట్టారు.
కోకాపేట్ సర్వీస్ రోడ్డులో బైక్ డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ క్రమంలో.. బైక్ పై వెళ్తున్న విద్యార్థి స్వాత్విక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా.. అతని పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే గాయపడిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు.