Srinivas Goud : తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తిరస్కరించడంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. దేవుడి దగ్గర ప్రాంతీయ వివక్షలు మంచివి కావని, తెలంగాణ ఆలయాల్లో అందరినీ సమానంగా చూసే విధానాన్ని గుర్తుచేశారు. తిరుమలలో కూడా ఇదే నిబద్ధత ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం గద్వాల నియోజకవర్గంలోని జములమ్మ అమ్మవారిని శ్రీనివాస్ గౌడ్ కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం గద్వాల బీఆర్‌ఎస్ నాయకుడు బాసు హనుమంత నాయుడు…
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది. వరుసగా సెలవులు రావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది. ఇక, క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి.. వెలుపల క్యూలైన్ లో భక్తులు వేచి ఉన్నారు. ఇక, టోకేన్ లేని భక్తుల సర్వ దర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతుంది. Read Also: PSLV-C60 Rocket: రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ 60 రాకెట్..…
2025 జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజులపాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనుంది టీటీడీ. పది రోజులపాటు టోకెన్ కలిగిన భక్తులకు మాత్రమే స్వామివారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించునుంది. మరోవైపు వైకుంఠ ద్వార దర్శనంపై అధికారులతో సమీక్షించారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి..
తమిళనాడులోని అరుల్మిగు కంద స్వామి ఆలయంలో ఒక భక్తుడి ఐఫోన్ ప్రమాదవశాత్తు హుండీ (విరాళం పెట్టె)లో పడింది. దీంతో నిర్వాహకులు ఇది ఆలయ ఆస్తిగా ప్రకటించారు. హుండీలో ఏ వస్తువు పడితే అది దేవుడి సొత్తుగా పరిగణిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. దీంతో ఆ వ్యక్తి నెత్తికి చేతులు పెట్టుకోవాల్సి వచ్చింది. ఫోన్ తిరిగి రాకపోవడంతో ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సి వచ్చింది.
2025 జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజులపాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనుంది టీటీడీ. పది రోజులపాటు టోకెన్ కలిగిన భక్తులకు మాత్రమే స్వామివారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించునుంది.
Strange Incident : పాతబస్తీ మేకల్ బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో వింత ఘటన చోటు చేసుకుంది. శ్రీ నల్లపోచమ్మ దేవాలయం ఆవరణలో మంగళవారం రాత్రి నేల మీద పసుపు పై ఒక పాద ముద్ర ప్రత్యక్షమయ్యింది. స్వామి పూజ చేసుకుని దేవాలయంలోని సన్నిధానానికి రాత్రి 11.32గంటలకు చేరుకున్న బాలకృష్ణ అనే యువకుడు మొట్ట మొదట అక్కడ అమ్మవారి పాద ముద్ర ఉన్నట్లు గుర్తించాడు. ఒకే కాళు కు సంబంధించిన పాద ముద్ర మాత్రమే స్పష్టంగా ఉండడంతో…
కేరళలోని శబరిమల అయ్యప్ప భక్తులకు పోలీసులు గుడ్న్యూస్ చెప్పారు. శబరిమల అయ్యప్ప ఆలయంలో వార్షిక మండలం-మకరవిళక్కు తీర్థయాత్ర నవంబర్ 16 నుంచి ప్రారంభమైంది. 41 రోజుల పాటు సాగే ఈ పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తున్నారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేరళ పోలీసులు ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించారు. జిల్లా పోలీసు చీఫ్ వి.జి. వినోద్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు సైబర్ సెల్ 'శబరిమల - పోలీస్ గైడ్'…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీ రోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. అయితే, కొందరు భక్తులు చేసే పిచ్చి చేష్టలు మిగతా భక్తులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.. అయితే, తిరుమలలో ఫొటో షూట్లు, రీల్స్ చేయడం.. లాంటివి నిషేధించినా.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఎన్నిసార్లు హెచ్చరించినా.. కొందరు భక్తులు, యూట్యూబర్లు తీరు మార్చుకోవడం లేదు.. లైక్ ల కోసం పవిత్రమైన చోట బూతు పాటలకు రీల్స్ చేస్తూ.. వెగటు పుట్టిస్తున్నారు..
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. అయ్యప్ప మాల ధారణ చేసిన స్వాములు ఆర్టీసీ డిపో ముందు ధర్నా చేపట్టారు. ఆర్టీసీ డిపోలో అయ్యప్ప స్వామి మాల ధరించి డ్రైవర్ గా పనిచేస్తున్న ఉద్యోగికి నాగరాజుకు అవమానం జరిగిందని స్వాములు తెలిపారు.
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుక్క స్వైరవిహారం కలకలం రేపుతుంది. ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి జాతరలో 21 మందిని కుక్క కరవడంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు.