Kaleshwaram: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో మహాఘట్టం మహాకుంభాభిషేకం నేడు (ఆదివారం) వైభవంగా నిర్వహించారు. తుని తపోవన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా ఈ మహకుంభాభిషేకం పూజలు ఘనంగా జరుగాయి. ఈ సందర్భంగా ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాలు, రాజగోపురాల కలశాల సంప్రోక్షణ పూజలు, మహాకుంభాభిషేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండ సురేఖ, మాజీ ఎంపీ పొన్నం…
Tirumala: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఆ తిరుమల తిరుపతి కొండపై భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగి పోయింది. శ్రీవారి దర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీయులు సైతం సందర్శిస్తుంటారు. ఎంతో ఖ్యాతి ఉన్న తిరుమల శ్రీవారి ఆలయంపై ఇటీవల విమానాలు చక్కర్లు కొట్టడం చర్చనీయాంశంగా మారింది. నేడు(శనివారం) మరోసారి ఆలయ గోపురం పై నుంచి విమానం చక్కర్లు కొట్టింది. కాగా ఆగమ శాస్త్రాల నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై నుంచి రాకపోకలు నిషిద్ధం. రాకపోకలు సాగిస్తే ఆపదలు సంభవిస్తాయని ఆగమ పండితులు టీటీడీకి సూచించారు. దీనిపై టీటీడీ పలుమార్లు కేంద్రానికి…
మహాకుంభమేళా 2025 ఈరోజు నుంచి ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైంది. సంగం ఒడ్డుకు భక్తులు, సాధువులు, సాధువులు భారీగా తరలివచ్చారు. పౌష్ పూర్ణిమ సందర్భంగా మహాకుంభ మొదటి 'షాహి స్నాన్' నిర్వహిస్తున్నారు. 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ అరుదైన ఖగోళ యాదృచ్చికానికి సంబంధించి భక్తుల ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. ఈ మహాకుంభానికి 15 లక్షల మందికి పైగా విదేశీ పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా నేటి నుంచి ప్రారంభమైంది. నేటి నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే మహాకుంభంలో ఈసారి 40 కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా. సంగం ఒడ్డున భక్తులు, సాధువులు, సాధువులు భారీగా తరలివచ్చారు. పౌష్ పూర్ణిమ సందర్భంగా మహాకుంభ మొదటి 'షాహి స్నాన్' నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
Maha kumbh Mela 2025: గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం ప్రయాగ్ రాజ్.. మహా కుంభ మేళాకు రెడీ అయింది. నేటి (జనవరి 13) నుంచి ఈ ఆధ్యాత్మిక ఉత్సవం ప్రారంభం అయింది. పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమయ్యే ఈ మహా కుంభ్.. సుమారు 45 రోజుల పాటు జరగనుంది.
ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు ఈవో శ్యామలరావు. వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 10వ తేదీ ఉదయం 4:30 గంటలకు ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు దర్శనం ప్రారంభమవుతుందన్నారు..
తిరుపతిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 108 అంబులెన్స్ భక్తులపైకి దూసుకెళ్లింది. చంద్రగిరి (మం) నరశింగాపురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి.
నూతన సంవత్సరం వేళ దేశ వ్యాప్తంగా ప్రజలు ఆలయాలకు పోటెత్తారు. ఉదయం నుంచే దర్శనాలు చేసుకోవడం ప్రారంభించారు. దీంతో ఆయా ఆలయాలన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి.