తమిళనాడులోని అరుల్మిగు కంద స్వామి ఆలయంలో ఒక భక్తుడి ఐఫోన్ ప్రమాదవశాత్తు హుండీ (విరాళం పెట్టె)లో పడింది. దీంతో నిర్వాహకులు ఇది ఆలయ ఆస్తిగా ప్రకటించారు. హుండీలో ఏ వస్తువు పడితే అది దేవుడి సొత్తుగా పరిగణిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. దీంతో ఆ వ్యక్తి నెత్తికి చేతులు పెట్టుకోవాల్సి వచ్చింది. ఫోన్ తిరిగి రాకపోవడంతో ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సి వచ్చింది.
వినాయకపురం నివాసి దినేష్ కుటుంబ సమేతంగా.. నెల రోజుల క్రితం ఆలయాన్ని సందర్శించాడు. పూజ అనంతరం హుండీలో డబ్బులు వేసేందుకు ప్రయత్నించగా, ఆ క్రమంలో చొక్కా జేబులోంచి ఐఫోన్ జారి హుండీలో పడింది. హుండీ ఎత్తుగా ఉండడంతో ఫోన్ తీయలేకపోయాడు. భయాందోళనకు గురైన దినేష్ ఆలయ నిర్వాహకులను సంప్రదించగా, హుండీలో పడిన తర్వాత అది దేవుడి సొత్తు కాబట్టి తిరిగి ఇవ్వలేదని చెప్పారు.
READ MORE: Game Changer: టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ టైం.. గేమ్ ‘ఛేంజింగ్’ ఈవెంట్ కోసం రెడీ!
సంప్రదాయం ప్రకారం రెండు నెలలకోసారి మాత్రమే హుండీ తెరుస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. దినేష్ హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ (HR&CE) డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేసి, హుండీ తెరవాలని విజ్ఞప్తి చేశాడు. శుక్రవారం హుండీ తెరవగా.. దినేష్ తన ఫోన్ తీసుకోవడానికి వచ్చాడు. అయితే ఈ ఫోన్ ఆలయ ఆస్తి అని ఆలయ నిర్వాహకులు స్పష్టం చేశారు.
READ MORE: Donald Trump: “అమెరికా నుంచి చమురు కొనాలి, లేదంటే..” యూరప్‌కి ట్రంప్ వార్నింగ్..
ఆలయ కార్యనిర్వహణాధికారి కుమారవేల్ మాట్లాడుతూ.. “ఉద్దేశపూర్వకంగా వేశాడా? పొరపాటున పడిందా? అనే అంశంపై మాకు స్పష్టత లేదు. హుండీకి పూర్తిగా ఇనుప కంచె వేసి రక్షణ కల్పిస్తున్నాం. కేవలం సిమ్ కార్డును మాత్రమే తిరిగి ఇచ్చాం. ఫోన్ నుంచి డేటాను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అనుమతించాం. హుండీలో ఏ వస్తువు పడితే అది దేవుడి సొత్తుగా భావిస్తాం.” అని స్పష్టం చేశారు.