నూతన సంవత్సరం వేళ దేశ వ్యాప్తంగా ప్రజలు ఆలయాలకు పోటెత్తారు. ఉదయం నుంచే దర్శనాలు చేసుకోవడం ప్రారంభించారు. దీంతో ఆయా ఆలయాలన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరానికి, వారణాసిలోని బాబా శ్రీ కాశీ విశ్వనాథ ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో సమీప ప్రాంతాలన్నీ భక్తుల రాకతో కిటకిటలాడిపోయాయి. పలుచోట్లు వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సాయంత్రం 4 గంటల సమయానికి 3.5 లక్షల మంది భక్తులు ప్రార్థనలు చేసేందుకు బాబా శ్రీ కాశీ విశ్వనాథుని ఆశీస్సులు పొందేందుకు ఆలయాన్ని సందర్శించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. బుధవారం వారణాసిలో తెల్లవారుజామున 3 గంటల నుంచి బాబా శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ పవిత్ర ప్రాంగణానికి భారీ సంఖ్యలో వచ్చినట్లు పేర్కొన్నారు. సాయంత్రం వరకు రద్దీ కొనసాగింది. ఏడాది తొలిరోజు సూర్యోదయం కోసం భక్తుల ఆసక్తి చూపించారు.
స్థానిక పరిపాలన అంచనాల ప్రకారం.. కొత్త సంవత్సరం సందర్భంగా అయోధ్యలో ఇప్పటికే రెండు లక్షల మందికి పైగా భక్తులు శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం ఉదయం దాదాపు మూడు లక్షల మంది భక్తులు రాముడ్నిదర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. గతేడాది జనవరి 22న అయోధ్యలోని రామమందిరానికి ప్రతిష్ఠాపన జరిగింది. రాత్రి వరకు ప్రవేశం కొనసాగుతుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది.
గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రపంచం మొత్తం నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటోందని రామ్ టెంపుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. శీతాకాలంతో పాటు సెలవులు రావడంతో అధిక సంఖ్యలో సందర్శకుల సంఖ్యకు పెరిగిందని వెల్లడించారు. పాఠశాలలు, కోర్టులు, వ్యవసాయ పనులు లేకపోవడంతో పెద్ద సంఖ్యలు తరలివచ్చినట్లుగా పేర్కొన్నారు. గోవా, నైనిటాల్, సిమ్లా, ముస్సోరీ వంటి సాంప్రదాయ పర్యాటక ప్రాంతాలకు బదులుగా అయోధ్యకు యాత్రికులకు పెరిగినట్లుగా రాయ్ చెప్పారు. రద్దీని అదుపు చేసేందుకు భారీగా పోలీసులు మోహరించారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించామని, 24 గంటలూ వాహన తనిఖీలు నిర్వహించామని స్థానిక అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఒకరోజు ముందుగానే భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారం సాయంత్రం నాటికి రెండు లక్షల మందికి పైగా యాత్రికులు దర్శనం పూర్తి చేసుకున్నారు. స్థానిక, బయటి ప్రాంతాల సందర్శకులు పట్టణంలోకి రావడంతో హోటళ్లు, ధర్మశాలలు, హోమ్‌స్టేలు పూర్తిగా నిండిపోయాయి.
న్యూ ఇయర్ వేడుకలకు పెద్ద ఎత్తున జనం వస్తారని అంచనా వేస్తూ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), వాటర్ పోలీస్ మరియు ప్రావిన్షియల్ ఆర్మ్‌డ్ కాన్స్‌టేబులరీతో సహా ప్రత్యేక బలగాలు వివిధ ఘాట్‌ల దగ్గర మోహరించాయి. అత్యవసర పరిస్థితుల్లో 12 క్విక్ రియాక్షన్ టీమ్‌లు కూడా (QRTలు) సిద్ధంగా ఉంచారు.
Ayodhya | "Today, on January 1, 2025, from 7:00 AM onwards, devotees have been continuously having divine Darshans of Prabhu Shri Ram Lalla Sarkar. Devotees are having darshan through five queues without interruption. It is estimated that over 200,000 devotees have already had… pic.twitter.com/vqQEWvo4yT
— ANI (@ANI) January 1, 2025
#WATCH | Varanasi, Uttar Pradesh: Tourists in large numbers reach Namo Ghat on the first day of the New Year pic.twitter.com/8Q17IhkaqM
— ANI (@ANI) January 1, 2025