తిరుపతిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 108 అంబులెన్స్ భక్తులపైకి దూసుకెళ్లింది. చంద్రగిరి (మం) నరశింగాపురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్దరెడ్డమ్మ (40), శేగంవారిపల్లికి చెందిన లక్ష్మమ్మ (45) గా గుర్తించారు. పుంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేసుకుంటూ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మదనపల్లి నుంచి తిరుపతి రూయా ఆసుపత్రికి రోగిని తీసుకొస్తున్న 108 సిబ్బందిగా గుర్తించారు. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.