యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ ఆలయానికి భక్తులు రద్దీ కొనసాగుతోంది. నేడు ఆదివారం కావడంతో నృసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు తరలిరావడంతో క్యూకాంప్లెక్యులన్నీ నిండిపోయాయి. స్వామి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుండటంతో భక్తులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఒకవైపు వర్షం పడుతుండటంతో భక్తులకు స్వామి దర్శనం ఇబ్బంది కరంగా మారింది. లోనికి వెళ్లేందుకు చాలా సమయం వేచి చేయాల్సి వస్తోంది. శనివారం రాత్రి నుంచి వాన పడుతుండటంతో.. భక్తుల వర్షానికి లెక్క…
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీశైలం,కాశీపీఠాధిపతులు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని కాశీ జ్ఞానసింహాసన నూతన పీఠాధిపతి మల్లికార్జున విశ్వరాధ్య,శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్దరామాశివాచార్య దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న పీఠాధిపతులకు ఆలయ మర్యాదలను అనుసరించి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు, ఆలయచైన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి అభిషేకం జరిపించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. పీఠాధిపతుల వెంట వివిధ మఠాలకు సంబంధించిన మఠాధిపతులు కూడా విచ్చేసి స్వామి అమ్మవారిని…
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఆగస్టు నెలకు సంబంధించిన అన్ని టికెట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.. ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్‌కు భారీ డిమాండ్ ఉండగా.. నిమిషాల వ్యవధిలోనే అని టికెట్లు బుక్‌అవుతున్న విషయం తెలిసిందే.. ఇక, ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లను రేపు ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల కాబోతున్నాయి.. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజుల సేవ, సహస్ర దీపాలంకరణ సేవా టిక్కెట్లను కూడా రేపే విడుదల చేయనుంది…
నిత్యం భక్తులతో కళకళలాడే తిరుమలకు భక్తులతో పాటు అడవుల్లో వుండే వన్యప్రాణులు కూడా స్వేచ్ఛగా తిరిగేస్తున్నాయి. ఏడాదిన్నర క్రితం చిరుతపులులు, ఎలుగుబంట్లు, పాములు, జింకలు ఘాట్ రోడ్లపై కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా తిరుమలలో వన్యప్రాణులు సంచారం కొనసాగుతుంది. సీజన్ బట్టి జంతువులు సంచరిస్తుంటాయి. ఆ మధ్య చిరుతలు….మొన్నటి వరకు ఏనుగులు సంచారంతో భక్తులు భయభ్రాంతులకు గురికాగా….తాజాగా ఎలుగుబంట్లు సంచారం భక్తులుతో పాటు స్థానికులును ఆందోళనకు గురిచేస్తోంది. శుక్రవారం అర్దరాత్రి సమయంలో ఏకంగా మూడు ఎలుగు బంట్లు…
*ఇవాళ ఢిల్లీలో కీలక న్యాయ సదస్సు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు,ముఖ్యమంత్రులు సదస్సు. ప్రారంభించనున్న ప్రధాని మోడీ. హాజరుకానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. * ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం. 64 అంశాలతో అజెండాను రూపొందించిన అధికారులు * తిరుపతిలో మే 5న సిఎం జగన్ చేతులమీదుగా చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన. ఎస్వీ క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభం *నేడు నంద్యాలలో ఇఫ్తార్ విందులో పాల్గొననున్న డిప్యూటీ…
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రాణహిత పుష్కరాలు కూడా తోడవడంతో గత 10 రోజులుగా రాజన్న ఆలయంలో భక్తుల సందడి పెరిగింది. గత 23 రోజులుగా హుండీ కౌంటింగ్ జరగకపోవడంతో ఆలయంలోని హుండీలన్నీ నిండిపోయాయి. ఈనెల 10న శ్రీరామనవమి ఉత్సవాలు ముగిసిన వెంటనే, ఇన్చార్జి ఈవో రమాదేవి వెళ్ళిపోవడంతో హుండీలను లెక్కించలేదు. ప్రధానాలయం తో పాటు బద్ది పోచమ్మ దేవాలయంలో కూడా హుండీలు నిండిపోయాయి. ఆలయంలో…
ప్రాణహిత నదికి భక్తులు పోటెత్తారు. ప్రాణహిత పుష్కరాలు నేటితో పరిసమప్తం కానున్నాయి .దీంతో ప్రాణహిత పుష్కర ఘాట్లు భక్తులతో కిక్కిరిసాయి. పాఠశాలలకు వేసవి సెలవులు కూడా ప్రకటించడంతో పిల్లా పాపలతో పుష్కర స్నానాలకు బయలుదేరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ప్రాణహిత పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. పుష్కరాలు చివరిరోజు కావడంతో వేకువ జామున నుండే తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుండి కాళేశ్వరం త్రివేణి సంగమానికి చేరుకొని గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు…
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల గుండా ప్రవహించే ప్రాణహిత నది పుష్కరాలు చివరి అంకానికి చేరుకున్నాయి. మిగిలింది మరో రెండు రోజులే కావడంతో వివిధ ప్రాంతాలనుంచి పుణ్యస్నానాలకు తరలివస్తున్నారు భక్తులు. ఇవాళ్టితో పదవ రోజుకు చేరుకున్నాయి ప్రాణహిత పుష్కరాలు. కొమురం భీం జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి పుష్కర ఘాట్ కు తరలి వస్తున్నారు భక్తులు. ప్రాణహిత పుష్కరఘాట్లు ఇవే తుమ్మిడిహెట్టి– కౌటాల మండలం, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అర్జునగుట్ట–మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిరోంచ – మహారాష్ట్ర…