తిరుమల గిరులకు భక్తుల తాకిడి కొనసాగుతోంది.. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు క్యూకట్టారు.. ఇప్పటికే వైకుంఠ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి.. బయట 2 కిలోమీటర్లకు పైగా దూరం భక్తులు క్యూలో వేచిచూస్తున్నారు.. మరోవైపు.. వరుస సెలవులు కూడా వస్తుండడంతో.. భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది.. దీంతో.. అప్రమత్తమైన టీటీడీ అధికారులు ముందస్తు చర్యలకు దిగుతున్నారు.. భక్తులకు విజ్ఞప్తి చేశారు.. భక్తుల రద్దీ కారణంగా వయోవృద్ధులు, వికలాంగులు, చంటి బిడ్డల తల్లితండ్రులు తమ పర్యటన వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది టీటీడీ.. ఆగస్టు 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వరుస సెలవులు.. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు పెరటాసి మాసం కారణంగా భక్తులు తాకిడి పెరుగుతుందని అంచనా వేస్తున్న అధికారులు.. ఈ సమయంలో.. వయోవృద్ధులు, వికలాంగులు, చంటి బిడ్డల తల్లితండ్రులు దర్శనం కోసం ఎక్కువ సమయం క్యూ లైన్‌లలో వేచిఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.. కావున భక్తులు తమ పర్యటనను అక్టోబర్ వరకు వాయిదా వేసుకోవాలని సూచించింది తిరుమల తిరుపతి దేవస్థానం.
Read Also: Island For Sale: అమ్మకానికి దీవి.. డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ కంటే తక్కువ ధరే..!