తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు.. వరుస సెలవులు రావడానికి తోడు.. పెళ్లిల సీజన్ కూడా కావడంతో.. తిరుమలకు తరలివస్తున్నారు భక్తజనం.. శ్రీవారి సర్వదర్శనానికి ఏకంగా 20 గంటల సమయం పడుతుందంటే.. భక్తులు ఏ స్థాయిలో వస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.. ప్రస్తుతం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లని నిండిపోయి.. ఆస్థాన మండపం వరకు క్యూ లైనులో వేచివున్నారు భక్తులు.. ఇక, ఇవాళ రెండో శనివారం, రేపు ఆదివారం కావడంతో.. సాయంత్రానికి క్యూ లైను మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుండగా.. సాయంత్రానికి మరింత పెరిగే అవకాశం ఉంది.. మరోవైపు, వసతి గదులన్నీ ఫుల్ అయ్యాయి.. గదులు దొరకక ఇబ్బందులుకు గురవుతున్నారు భక్తులు. ఇక, శుక్రవారం 64,079 మంది భక్తులు దర్శించుకున్నారు.. వారిలో 32,852 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ. 3.52 కోట్లు వచ్చింది.. ఇప్పుడు భక్తుల రద్దీ పెరగడంతో.. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా ఇవాళ మరింత పెరగనుంది.
Read Also: Munugode bypoll : మునుగోడులో రాజకీయా పార్టీలు పోటా పోటీగా కత్తులు దూసుకుంటున్నాయా..?