నిత్యం భక్తులతో కళకళలాడే తిరుమలకు భక్తులతో పాటు అడవుల్లో వుండే వన్యప్రాణులు కూడా స్వేచ్ఛగా తిరిగేస్తున్నాయి. ఏడాదిన్నర క్రితం చిరుతపులులు, ఎలుగుబంట్లు, పాములు, జింకలు ఘాట్ రోడ్లపై కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా తిరుమలలో వన్యప్రాణులు సంచారం కొనసాగుతుంది. సీజన్ బట్టి జంతువులు సంచరిస్తుంటాయి. ఆ మధ్య చిరుతలు….మొన్నటి వరకు ఏనుగులు సంచారంతో భక్తులు భయభ్రాంతులకు గురికాగా….తాజాగా ఎలుగుబంట్లు సంచారం భక్తులుతో పాటు స్థానికులును ఆందోళనకు గురిచేస్తోంది.
శుక్రవారం అర్దరాత్రి సమయంలో ఏకంగా మూడు ఎలుగు బంట్లు సబ్ స్టేషన్ వద్ద సంచరిస్తూండగా….సిబ్బంది ఉలిక్కిపడ్డారు. వెంటనే విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించడంతో వాటిని సైరన్ మ్రోగిస్తూ అటవీ ప్రాంతం వైపు తరిమేసారు. మొత్తానికి మూడు ఏలుగు బంట్లు ఒకే ప్రాంతంలో సంచరిస్తూండడంతో భక్తులలో భయాందోళనకు గురైతున్నారు. అటవీశాఖ సిబ్బంది మాత్రం ఎలుగుబంట్లు వలన ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని….వాటిని అటవీ ప్రాంతం వైపు మళ్ళించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంతో పోలిస్తే తిరుమలకు రోజూ 50 వేలమందికి పైగా భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్న 65,725 మంది భక్తులు దర్శించుకున్నారు. పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో మరింతగా భక్తులు స్వామివారి దర్శనానికి తరలిరానున్నారు.
Tirumala: భక్తులతో కళకళ… శ్రీవారి హుండీ గలగల