సూర్యగ్రహణం వేళ అన్ని ఆలయాలు మూతబడ్డా శ్రీకాళహస్తి ఆలయం భక్తులతో పోటెత్తింది.శ్రీకాళహస్తి దేవస్థానంలో సూర్యగ్రహణం స్పర్శ కాలంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు ప్రారంభం అయ్యాయి. స్వామి వారి అభిషేకంలో పాల్గొన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా ఎస్పీపరమేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. భక్తులను వెంటనే కంట్రోల్ చేసి దర్శనం త్వరగా అయ్యేలా చూడాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. భక్తులు భారీగా తరలి రావడంతో శ్రీకాళహస్తిలో రద్దీ ఏర్పడింది. ఇసుకేస్తే రాలనంతమంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దీంతో వారిని కంట్రోల్ చేయడం సిబ్బందికి, పోలీసులకు కష్టంగా మారింది.
Read Also: Sony Pictures India: ‘సోనీ పిక్చర్స్ ఇండియా’ రీబ్రాండ్
ఇదిలా వుంటే.. శ్రీకాళహస్తీ ఆలయంలో దర్శనం కోసం ఒకరిని ఒకరు కొట్టుకున్నారు భక్తులు. మంత్రి పెద్దిరెడ్డి ఆలయానికి వెళుతున్న సమయంలో ఆయన ముందే బాహాబాహాకి దిగారు భక్తులు.. దర్శనానికి వెళ్ళే క్రమంలో రద్దీ ఎక్కువగా వుండడంతో గొడవ జరిగింది. గ్రహణం వున్నా.. శ్రీకాళహస్తి ఆలయంలోకి ప్రవేశించి పూజలు చేస్తారు భక్తులు. రాహు, కేతువులకు దోష నివారణ పూజలు చేసే శ్రీకాళహస్తీశ్వరాలయంలో గ్రహణ ప్రభావం ఏమీ ఉండదని పండితులు చెబుతారు.
అలాగే, గ్రహణానంతరం కాళహస్తీశ్వరుడిని దర్శనం చేసుకుంటే దారిద్ర్యం, దోషాలు, అనారోగ్యం తొలగిపోయి.. సకల సంపదలు చేకూరుతాయని భక్తులు నమ్ముతారు. మిగతా రోజులలో ఎలా వున్నా గ్రహణాల రోజు మాత్రం అంతా తిరుపతికి పయనం అవుతారు. శ్రీకాళహస్తిలో ఆలయానికి భక్తులు కూడా వచ్చి రాహు కేతు దోష నివారణ పూజలు చేయించుకుంటారు. ఎంత కష్టమయినా ఇలా చేస్తే మటుమాయం అవుతుందంటారు. అలాగే స్వామి, అమ్మవారి దర్శనం చేసుకుంటే రాహుకేతు దోషమే కాకుండా నక్షత్ర, నవ గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని విశ్వాసం. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ప్రదక్షిణలు అపసవ్య దిశలో జరుగుతాయి.
Read Also: Minister KTR: మోడీకి బహిరంగ లేఖ.. నమో అంటే నమ్మించి మోసం చేసేవాడు