వేడివేడిగా ఉన్న పెనంపై కూర్చుని భక్తులను బాబా ఆశీర్వదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సంత్ గురుదాస్ మహరాజ్గా గుర్తించబడిన ఈ బాబా మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో గోసంరక్షణ సంస్థలను నడుపుతున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భోళా శంకరుడిని దర్శనానికి శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునుంచే భక్తులు పూజలు, అభిషేకాలు చేస్తూ శంభో శంకరా భోళ శంకరుడిని కీర్తిస్తూ శివుని కృపకు పాత్రులవుతున్నారు.
మాఘ అమావాస్య.. అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగించే రోజు. అందరి మనసులను భక్తి సాగరంలో ముంచెత్తే వేడుక. మాఘమాసంలో వచ్చే బహుళ అమావాస్యలు అందరినీ భగవంతుని సన్నిధికి నడిపిస్తూ.. ముక్తిని పొందడం గురించి ఆలోచించేలా చేస్తాయి