Israel: ‘‘ప్రభుత్వాన్ని పడగొట్టండి’’.. ఇరాన్ ప్రజలకు నెతన్యాహూ పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో ఇజ్రాయిల్ పై భారీ దాడులు చేస్తోంది. శనివారం అమెరికాతో కలిసి జరిపిన దాడుల్లో ఆ దేశ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరణించారు. దీంతో ఇరాన్ మధ్యప్రాచ్యం అంతటా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రైయిన్, ఖతార్, ఒమన్‌లను టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా దుబాయ్, ఖతార్ సిటీ, అబుదాబిలపై మిస్సైల్స్, డ్రోన్లతో విరుచుకుపడుతోంది.
ఇదిలా ఉంటే, తాజాగా ఇజ్రాయిల్ మరోసారి ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఘోరమైన దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌లోని అన్ని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తామని చెప్పారు. ఇదే కాకుండా.. ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టాలని పిలుపునిచ్చారు. ఇరాన్ ప్రజలక వైపు ఇజ్రాయిల్ ఉంటుందని చెప్పారు.
Also Read
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
- Explainer: అక్కడికి పోతే... అటు నుంచి అటే పోతారు..!
- Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. 'ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం'
- Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
Read Also: Pakistan: పాకిస్తాన్‌కు అంటుకున్న “ఇరాన్” మంటలు.. యూఎస్ కాల్పుల్లో 12 మంది మృతి..
ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మరణం తర్వాత, ఒక వీడియో సందేశంలో నెతన్యాహూ మాట్లాడుతూ.. ‘‘ఖమేనీని చంపి అధికార మార్పుకు మార్గం సుగమం చేస్తుంది, ఇజ్రాయిల్ దాడులు ఇరాన్ సైనిక, పాలన వ్యవస్థల్ని బలహీనం చేస్తుంది, పౌరులు ‘‘ఉగ్రవాద పాలన’’కు ఎదురుతిరిగే పరిస్థితుల్ని సృష్టిస్తుంది’’ అని అన్నారు. ఇరాన్ ధైర్యవంతులైన ప్రజలు నిరంకుశత్వ గొలుసుల నుంచి తమను తాము విడిపించుకోవడానికి ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు వెల్లడించారు.
ఇది ప్రతీ తరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశమని ఆయన అన్నారు. ఇరానియన్లు లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి పాలన వ్యవస్థను కూల్చివేయాలని నెతన్యాహూ చెప్పారు. పర్షియన్లు, కుర్దులు, అజెరిలు, అహ్వాజీలు, బలూచిలతో సహా అన్ని జాతులు సమూహాలను ఇజ్రాయిల్ ప్రధాని ఉద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ సమయంలో ఇరాన్ నాయకత్వాన్ని తొలగించడం ఇజ్రాయెల్ సైనిక లక్ష్యాలలో భాగమా అని తనను గతంలో అడిగినట్లు నెతన్యాహు చెప్పారు.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు