మొసలి అనగానే అది మాంసాహారాన్నే తీసుకుంటుందని అనుకుంటాం.. సముద్రంలో, చెరువుల్లో, నదుల్లో ఇలా ఎక్కడున్నా కూడా మనుషులపై ముసుళ్లు దాటిచేసిన ఘటనలు అనేకం.. ఇక, ఒడ్డుకు వచ్చిన జంతువులపై కూడా అదునుచూసి.. లాగేయడంలో వాటికి అవేసాటి.. బలవంతమైన ఏనుగు కూడా నీటిలో ఉన్నప్పుడు.. ముసలికి చిక్కిందంటే.. ఇక అంతే సంగతులు.. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. కేరళ కాసరగోడ్‌లోని అనంతపుర సరస్సులో ఉండే మొసలి మాత్రం మాంసం జోలికి వెళ్లదు.. అది పూర్తిగా శాఖాహారి.. ఆ సరస్సులో ఉండే అనంత పద్మనాభ స్వామి దర్శనానికి వచ్చే భక్తులు పెట్టే బెల్లం, బియ్యం లాంటి ప్రసాదాలు మాత్రమే తినే 77 ఏళ్ల వయస్సున్న మొసలి ఇప్పుడు కన్నుమూసింది.. బబియా అనే పిలవగానే వచ్చి.. ప్రసాదం తీసుకుని.. భక్తులను ఆశీర్వదించే.. ఆ అరుదైన మొసలి.. కన్నుమూయడంతో.. భక్తులు కన్నీరుమున్నీరవుతున్నారు..
Read Also: Munugode Bypoll: ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకుంటాం.. మంత్రి జగదీష్‌రెడ్డి సంచలన ప్రకటన
అయితే, దాదాపు 77 ఏండ్ల కిందట కాసరగోడ్‌లోని అనంతపుర సరస్సులో కనిపించింది ఆ మొసలి..1945లో ఆ సరస్సులో ఉన్న ఓ మొసలిని బ్రిటిష్ సైనికుడు కాల్చిచంపగా.. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ మొసలి ప్రత్యక్షమైందని భక్తులు నమ్ముతారు.. అప్పటి నుంచి 70 ఏళ్లను కూడా సరస్సులోనే ఉంటూ.. ఆలయానికి వచ్చే భక్తుల నుంచి ప్రసాదాలు స్వీకరించే ఆ మొసలి.. ఇప్పటి వరకు ఎవరికీ కీడు చేసింది లేదు.. ఇక, ఆలయ నిర్వాహకులు దానికి బబియా అని నామకరణం చేసి.. దాని బాగోగులు చూసుకుంటూ వచ్చారు.. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం ఆలయానికి వచ్చే భక్తులు పెట్టే ప్రసాదం స్వీకరించి.. వారిని ఆశీర్వదించి.. ఆ సరస్సులో ఆలయం చుట్టూ తిరగడమే బబియా పని.. కొన్నిసార్లు మెట్లపైకి వచ్చి సేదతీరుతూ ఉండేది.. ఇది పద్మనాభస్వామి ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా ఉండేది.. కానీ, 70 ఏళ్లకు పైగా భక్తులను కనువిందు చేసిన బబియా ఇప్పుడు ప్రాణాలు విడిచింది.. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న బబియాకు వైద్యులు చికిత్స చేసినా ఫలితం లేకుండా పోయింది.. చివరకు ఆదివారం రాత్రి శాశ్వతంగా కన్నుమూసింది..
అయితే, బాబియా ఎప్పుడూ భక్తులను బెదిరించలేదు మరియు విధేయతతో చెరువు నుండి బయటకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది ఇతర జీవులకు మరియు చేపలకు కూడా హాని కలిగించదు.. ప్రజలు మరియు దేవాలయం పూజారులు సమర్పించే నైవేద్యాలతో మాత్రమే మనుగడ సాగిస్తుందని నమ్మకం.. అందుకే దీనికి శాఖాహార మొసలి అని పేరు వచ్చింది. మొసలి అప్పుడప్పుడు సరస్సులోని బొరియ నుండి ఒడ్డుకు వచ్చి పూజా మందిరానికి చేరుకునేది.. బబియా గుడి ముందు ‘దర్శనం’ చేస్తున్నప్పుడు.. ఒక సందర్భంలో బయటకు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో చాలా ప్రచారం పొందింది.. మరియు భక్తులు కూడా బబియాను ఫొటోలు తీశారు.. సెల్ఫీలు కూడా దిగిన సందర్భాలు ఉన్నాయి.. ఇక, కన్నుమూయడం భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.. బబియాకు ఆలయానికి సంబంధించిన మైదానంలోనే అంత్యక్రియలు నిర్వహించారు.. ఈ విషయం తెలిసిన భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి.. బబియాకు కన్నీటివీడ్కోలు పలికారు..