యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ ఆలయానికి భక్తులు రద్దీ కొనసాగుతోంది. నేడు ఆదివారం కావడంతో నృసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు తరలిరావడంతో క్యూకాంప్లెక్యులన్నీ నిండిపోయాయి. స్వామి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుండటంతో భక్తులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
ఒకవైపు వర్షం పడుతుండటంతో భక్తులకు స్వామి దర్శనం ఇబ్బంది కరంగా మారింది. లోనికి వెళ్లేందుకు చాలా సమయం వేచి చేయాల్సి వస్తోంది. శనివారం రాత్రి నుంచి వాన పడుతుండటంతో.. భక్తుల వర్షానికి లెక్క చేయకుండా స్వామి దర్శనం కోసం తరలివస్తున్నారు. దీంతో ఆదివారం యాదాద్రి భక్తులతో సందడిగా మారింది. భక్తులు రద్దీ కారణంగా అధికారులు కొండపైకి వామనాలను అనుమతిలేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు.
Doctor Suicide: అనకాపల్లిలో ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్ ఆత్మహత్య