విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనక దుర్గమ్మ ఇవాళ దుర్గాదేవిగా అమ్మవారు దర్శనం ఇస్తున్నారు అని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఎంతో ప్రశాంతంగా ఇప్పటి వరకూ సజావుగా దసరా ఉత్సవాలు జరిగాయి.. రేపు ఉదయం 3 గంటల నుంచి మహిషాసురమర్ధని అవతారంలో అమ్మవారి దర్శనం ఉంటుంది అని ఆయన అన్నారు. రేపు ఉదయం 7:30 కి పోలీసు, ఎండోమెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ల సమన్వయ మీటింగ్ ఉంటుంది.. డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా సమావేశంలో ఉంటారు.. కొంత పోలీసు సిబ్బంది డామినేషన్ గమనించడం జరిగింది.. అవసారానికి మించి పోలీసులు అజమాయిషీ చేయకూడదు అని మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.
Read Also: Prabhas: కటౌట్ చూసి.. కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్
మహిషాసుర మర్ధని, రాజరాజేశ్వరీ గా రేపు అమ్మవారు దర్శనం ఇస్తారు అంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. శ్రవణా నక్షత్రయుక్త దశమిలో శమీపూజలు నిర్వహిస్తారు.. రేపు జమ్మిదొడ్డి వద్ద శమీపూజ నిర్వహిస్తాం.. అమ్మవారి అలంకరణ మార్పు కారణంగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచీ 2 గంటల వరకూ దర్శనం ఉండదు అని ఆయన తెలిపారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలని సాయంత్రం 4:30 కి ఇంద్రకీలాద్రి నుంచీ బయలుదేరి 5:30 నుంచీ దుర్గాఘాట్ లో హంసవాహనం మీద నదీ విహారం ఉంటుందని మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.
Read Also: TDP-Janasena Meeting: రేపే టీడీపీ-జనసేన పార్టీల తొలి జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ
భక్తులకు కూడా దుర్గాఘాట్ లో వీక్షించే అవకాశం ఇచ్చామని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఆనవాయితీగా వన్ టౌన్ పోలీసు స్టేషనుకు అమ్మవారి ఉత్సవ విగ్రహాలు తరలిస్తాం.. 24న దశమి ఉంది కనుక.. భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.. రేపటి రోజు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాటు చేసాం.. మంగళవారం నుంచీ గురువారం వరకూ భవానీల తాకిడి ఉంటుంది.. హంసవాహనంలో తెప్పోత్సవం జరిగేప్పుడు 30 మందికే అవకాశం ఉందని మంత్రి అన్నారు.