Simhachalam Giri Pradakshina: గిరిప్రదక్షిణలతో కిక్కిరిసిన సింహాచలం.. భారీగా తరలి వచ్చిన భక్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Simhachalam Giri Pradakshina: సింహాచల పుణ్యక్షేత్రం గిరిప్రదక్షిణలతో కిక్కిరిసిపోయింది. ఆదివారం ప్రారంభమైన గిరిప్రదక్షిణలు.. సోమవారం కూడా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో గిరిప్రదక్షిణలు జరుగుతూ ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. గిరి ప్రదక్షిణ మార్గాలు ఎటు చూసినా కిక్కిరిసిపోయి కనిపించాయి.. భక్తులు అప్పన్నస్వామిని స్మరించుకుంటూ ముందుకు సాగుతున్నారు. భక్తుల హరినామస్మరణలు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ అప్పన్నస్వామి నిత్య, నిజరూప నమూనాలతో కూడిన పుష్ప అప్పన్న తొలి పావంచ దగ్గర నుంచి గిరి ప్రదక్షిణకు వెళ్లింది.
Read also: Ram Boyapati Movie Title: రామ్-బోయపాటి సినిమా బిగ్ అప్డేట్ వచ్చేసింది..
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
సింహాచలం నుంచి బీఆర్‌టీఎస్ రోడ్డు మీదుగా తెన్నేటి పార్కు, సీతమ్మధార, ఎన్‌ఏడీ జంక్షన్, గోపాలపట్నం, ప్రహ్లాదపురం మీదుగా భక్తులు తిరిగి సింహాచలం దేవస్థానానికి చేరుకుంటున్నారు. మొత్తం 32 కిలోమీటర్ల మేర ప్రదక్షిణ చేసిన అనంతరం స్వామిని దర్శించుకుంటున్నారు. సోమవారం ఆషాఢ పౌర్ణమి సందర్భంగా లక్షలాదిమంది భక్తులు అప్పన్నను దర్శించుకుంటున్నారు. స్వామి దర్శనం సులభంగా జరిగేందుకు వీలుగా అదనపు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు నేడు ఆర్జితసేవల్ని రద్దు చేశారు.ఆదివారం కూడా సింహాచలం గిరిప్రదక్షిణకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఎండను కూడా లెక్కచేయకుండా స్వామిని తలచుకుంటూ ప్రదక్షిణలు కొనసాగించారు. అయితే 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో.. ఉక్కపోతతో భక్తులు ఇబ్బందిపడ్డారు. సాయంత్రానికి వాతావరణం పూర్తిగా మారిపోయి వర్షం పడటంతో భక్తులు కాస్త ఉపశమనం పొందారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు జీవీఎంసీ, పోలీసు, సింహాచలం దేవస్థానం సిబ్బంది ఏర్పాట్లు చేశారు.
స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ సంస్థలకు చెందిన వ్యక్తులు, వ్యాపారులు, అపార్టుమెంటు సంఘాలు, కొందరు వ్యక్తిగతంగా సేవా కార్యక్రమాలు చేశారు. గిరి ప్రదక్షిణలో నడక సాగించే భక్తుల కోసం దారి పొడవునా తాగునీరు, టిఫిన్‌లు, జ్యూస్‌లు, పండ్లు, కూల్ డ్రింకులు, పులిహోర వంటివి అందించారు. అలాగే కొందరు వైద్యశిబిరాలు నిర్వహించి మందులు అందజేశారు. జీవీఎంసీ నుంచి తాగునీటి వసతితో పాటు వైద్య సేవలందించారు. కొన్నిచోట్ల మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడంతో మహిళలు ఇబ్బందిపడ్డారు. అలాగే నరసింహనగర్ నుంచి పోర్టు క్వార్టర్స్ వరకు కొంత వరకు రోడ్డు సరిగా లేదని భక్తులు చెప్పారు. అక్కడక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవ్వగా పోలీసులు క్లియర్ చేశారు. ప్రదక్షిణ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ మల్లికార్జున పరిశీలించారు. జీవీఎంసీ కమిషనర్‌తో పాటుగా అధికారులు పలు ప్రాంతాల్లో పర్యటించారు. అధికారులతో మాట్లాడి భక్తులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సీపీ త్రివిక్రమవర్మ ఆధ్వర్యంలో 2,100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!