శుక్రవారం తిరుమల అలిపిరి నడకదారిలో శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా.. మూడేళ్ల చిన్నారి లక్షితను చిరుత ఎత్తుకెళ్లి బలి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఇవాళ తిరుమల నడకమార్గంలో చిరుత సంచరిస్తున్నట్లు కొందరు భక్తులు చెప్పారు. 2450 మెట్టు వద్ద చిరుత కనిపించందంటూ అధికారులకు సమాచారమిచ్చారు. చిరుతను చూసిన భక్తులు భయాందోళనకు గురై.. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు.. చిరుతను అడవిలోకి పంపించేదుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Read Also: Bandla Ganesh: రవితేజను నమ్మించి.. దారుణంగా మోసం చేశా..
చిన్నారి చిరుత దాడిలో మృతిచెందిన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులను నడకమార్గంలో భద్రత నడుమ గుంపులుగా పంపిస్తున్నారు. ప్రస్తుతానికి 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు గుంపులుగానే భక్తులను అనుమతిస్తున్నారు. అంతేకాకుండా.. మధ్యా్హ్నం నుంచి 15 సంవత్సరాల లోపు చిన్నారులను కూడా అనుమతించకపోవడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
Read Also: Vishwak Sen: బిగ్ బ్రేకింగ్.. పెళ్లి పీటలు ఎక్కుతున్న విశ్వక్.. ?
మరోవైపు చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ.. ఎంతకీ చిక్కడం లేదు. చిరుతను బంధించేందుకు రెండు బోన్లను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ట్రాప్ కెమెరాలతో దాని కదలికలను చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ.. చిన్నారి చిరుత దాడి అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నడకమార్గంలో వెళ్లాలంటేనే భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏ వైపు నుండి చిరుత వస్తుందోనని బిక్కుబిక్కున స్వామి దర్శనానికి వెళ్తున్నారు.