Devendra Fadnavis: లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరగిన భారత్ జోడో యాత్రలో "అర్బన్ నక్సల్స్" సంస్థలు పాల్గొన్నాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన ఆరోపణలు చేశారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో గురువారం ఆసక్తికర పరిణామం జరిగింది. అజిత్ పవార్ గురించి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కీలక వ్యాఖ్యలు. అజిత్ పవార్ ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారంటూ ఫడ్నవిస్ జ్యోసం చెప్పారు.
Maharashtra Cabinet: మహారాష్ట్రలో మంత్రి వర్గ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతుంది. హోంశాఖ కావాలని పట్టుబట్టిన శివసేన (షిండే) వర్గానికి ఆ పదవి దక్కడం లేదని ప్రచారంతో ఆయన ఆర్థిక రాజధాని ముంబైని వదిలి పెట్టినట్లు తెలుస్తుంది.
డిసెంబర్ 9న మహారాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గిన సంగతి తెలిసిందే. విశ్వాస పరీక్ష అనంతరం ప్రస్తుతం అందరి దృష్టి మహాయుతి కూటమి మంత్రివర్గ విస్తరణపై ఎక్కువగా ఉంది. డిసెంబరు 16న ప్రారంభమయ్యే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందు డిసెంబర్ 14న విస్తరణపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడిన మహాయుతి సర్కార్ లో తనకు హోంశాఖను ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే డిమాండ్ చేశారని శివసేన ఎమ్మెల్యే భరత్ గోగవాలే తెలిపారు. షిండే సీఎంగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం ఫడ్నవీస్‌కు హోంశాఖ ఇచ్చారని గుర్తు చేశారు.
Devendra Fadnavis: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని శివసేన ఠాక్రే, ఎన్సీపీ శరద్ పవార్ కూటమి ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ దారుణంగా ఓడిపోయింది. 288 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ కూటమి కేవలం 46 స్థానాలు మాత్రమే గెలిచింది. మరోవైపు బీజేపీ కూటమి మహాయుతి ఏకంగా 233 స్థానాలను కైవసం చేసుకుని మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది.
మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ఫడ్నవిస్‌తో పాటు డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే ప్రమాణం చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ముచ్చటగా మూడోసారి గురువారం సీఎంగా ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం ఒక పేషెంట్‌కు ఆర్థిక సాయంపై చేశారు.
మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం ప్రక్రియను స్టార్ట్ చేశారు. ఇక, ఏక్నాథ్ షిండే అక్కడున్న స్క్రిప్ట్‌ను చదవకుండా సొంతంగా ప్రసంగించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ముచ్చటగా మూడోసారి ఫడ్నవిస్ సీఎంగా ప్రమాణం చేశారు. గురవారం ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఫడ్నవిస్ చేత గవర్నర్ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు.