మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చిన 11 రోజుల తర్వాత ఉత్కంఠకు తెరపడి బుధవారం జరిగిన కీలక సమావేశంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఎంపిక చేసినట్లు బీజేపీ నాయకత్వం ఖరారు చేసింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం ప్రమాణస్వీకారోత్సవం ఈరోజు సాయంత్రం ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరగనుంది.
మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న అనిశ్చితి ఎట్టకేలకు తొలగింది. నవంబర్ 23న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి (శివసేన, బీజేపీ, ఎన్సీపీ) కూటమి ఘన విజయం సాధించింది.
Eknath Shinde: మహారాష్ట్ర సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. రేపు సాయంత్రం 5.30 గంటలకు ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం జరగబోతోంది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు ఎన్డీయే నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ఇప్పటికే గవర్నర్ రాధాకృష్ణన్‌కి కలిసిన మహాయుతి నేతలు, ప్రభుత్వ ఏర్పాటును కోరారు.
Devendra Fadnavis: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. సీఎం ఎవరనే దానిపై కూడా స్పష్టత వచ్చింది. రేపు సాయంత్రం ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు ఈ రోజు జరిగిన బీజేపీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరింది. రేపు సాయంత్రం 5 గంటలకు ముంబైలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగబోతోంది.
Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిసెంబర్ 05న మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో మంగళవారం దేవేంద్ర ఫడ్నవీస్, ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండేని కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన మొదలైన తర్వాత తొలిసారి ఫడ్నవీస్, షిండే సమావేశమయ్యారు.
Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఏక్ నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ల ‘మహాయుతి’ కూటమి సంచలన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 233 స్థానాలను కైవసం చేసుకుంది. 132 సీట్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మారింది. ఇదిలా ఉంటే, ఎన్నికల ఫలితాలు వచ్చి 10 రోజులు అవుతున్నా , మహారాష్ట్ర సీఎం ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రమాణ స్వీకారానికి డిసెంబర్ 5 తేదీని కూడా ప్రకటించినప్పటికీ ముఖ్యమంత్రి ముఖంపై ఉత్కంఠ నెలకొంది. కొత్త ముఖ్యమంత్రి ఎవరు? అన్న ప్రశ్నకు నేడు సమాధానం దొరకనుంది. షిండేతో బీజేపీ చర్చలు జరుపుతుండగా.. ఆయన గ్రామానికి వెళ్లడంతో దేశవ్యాప్తంగా రాజకీయాల్లో చర్చ మొదలైంది.