Maharashtra Cabinet: మహారాష్ట్రలో మంత్రి వర్గ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతుంది. డిసెంబర్ 5న రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ సహా అజిత్ పవార్, ఏక్ నాథ్ షిండేలు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, మంత్రి పదవుల పంపకంపై బీజేపీ నాయకత్వంతో చర్చలు జరపడానికి ఇప్పటికే మహయుతి నేతలు ఢిల్లీకి క్యూ కట్టారు. కాగా, NCP (ఏపీ) అధినేత అజిత్ పవార్ దేశ రాజధానిలో ఉండగా.. సీఎం ఫడ్నవీస్ సైతం గత రాత్రి కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలను కలిశారు. అయితే, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన శివసేన(షిండే) చీఫ్ ఏక్‌నాథ్ షిండే గత వారం రోజులుగా ముంబైలో కనిపించడం లేదు.
Read Also: Avanthi Srinivas Resign To YCP: వైసీపీకి రాజీనామా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అవంతి
అయితే, మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గ బెర్తులు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతంది. ఇందులో బీజేపీకి సీఎంతో పాటు 21-22 మంత్రి పదవులు దక్కనుండగా, శివసేనకు 12, ఎన్సీపీ నుంచి 10 మందికి మంత్రులుగా అవకాశం దక్కనుందని ప్రచారం అవుతుంది. ఇక, రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా మొత్తం 43 మంది మంత్రులుగా ఉండవచ్చు. కానీ, హోంశాఖ కావాలని పట్టుబట్టిన శివసేన (షిండే) వర్గానికి ఆ పదవి దక్కడం లేదని ప్రచారంతో ఆయన ఆర్థిక రాజధాని ముంబైని వదిలి పెట్టినట్లు తెలుస్తుంది. అయితే, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్‌సీపీ మద్దతు మాత్రమే అవసరం కాబట్టి షిండేకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని సమాచారం. సర్కార్ ఏర్పాటులో తాను అడ్డం కానని.. డిసెంబర్ 5న డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏక్‌నాథ్ షిండే బహిరంగంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇప్పుడు ఆయన ఢిల్లీ పర్యటనలో లేకపోవడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది.