నూతన సంవత్సరం వేళ మహారాష్ట్రలో కీలక పరిణామం జరిగింది. గడ్చిరోలి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట తారక్క సిదాం సహా 11 మంది మావోయిస్టులు బుధవారం లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులలో ప్రముఖ దండకారణ్య జోనల్ కమిటీ సభ్యురాలు విమల చంద్ర సిదాం అలియాస్ తారక్క ఉన్నారు. గత 38 సంవత్సరాలుగా నక్సలిజం ఉద్యమంలో ఉన్నారు. తారక్కపై రెండు కోట్లకుపైగా రివార్డు ఉంది. తారక్క… మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణు భార్య. తారక్కపై దాదాపు 170 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: 2025 Public Holidays List: ఈ ఏడాది బ్యాంకు, స్టాక్ మార్కెట్ సెలవులు ఇవే!
నక్సలిజం ముగింపు దశకు చేరుకుందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. రాజ్యాంగ సంస్థల ద్వారానే తమకు న్యాయం జరుగుతుందని మావోయిస్టులు భావిస్తున్నారని తెలిపారు. భారతదేశం అభివృద్ధిలో దూసుకెళ్తున్న నేపథ్యంలో మావోయిజం క్షీణిస్తోందని చెప్పారు. గడ్చిరోలి జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో నక్సలైట్ల ప్రాబల్యం తగ్గుముఖం పట్టిందని, నక్సలిజం అంతం కాబోతోందని అన్నారు. సమీప భవిష్యత్తులో గడ్చిరోలిలో విమానాశ్రయం వస్తుందని, గడ్చిరోలి ఓడరేవులను అనుసంధానించే జలమార్గాలను కూడా సర్వే చేయనున్నట్లు సీఎం ఫడ్నవిస్ తెలిపారు.
#WATCH | 11 naxals including Tarakka Sidam surrender before Maharashtra Chief Minister Devendra Fadnavis at Gadchiroli Police headquarters pic.twitter.com/YK7Ska5I4C
— ANI (@ANI) January 1, 2025